Health & Lifestyle

బరువు తగ్గడానికి కార్బోహైడ్రాట్లు తక్కువగా ఉండే ఆహారం తినండి.....

KJ Staff
KJ Staff

ప్రస్తుత కాలంలో అధిక బరువుతో బాధపడేవారు సంఖ్య ఎక్కువైపోయింది. బరువు ఎక్కువుగా ఉంటే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలేతెందుకు అవకాశం ఉంటుంది. దీనితో చాలా మంది బరువు తగ్గాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. బరువు తగ్గడం కోసం ఎన్నో రకాల కసరత్తులు, డైటింగ్ ఇలా ఎన్నో చేసిన చాలా మందిలో ఫలితం కనిపించదు. అయితే బరువు తగ్గడం అంత సులువైన విష్యం కాదు, కొంతమంది బరువు తగ్గడానికి ఎన్నో రకాల పానీయాలు కూడా తాగుతుంటారు.

బరువు తగ్గడానికి జిమ్ములకు వెళ్లడం, యోగ చెయ్యడం మరియు వాకింగ్ ఇలా ఎన్నో ప్రయత్నాలు చేసినాసరే ఫలితం కనిపించదు. బరువు తగ్గడంతో కార్బోహైడ్రాట్లు బరువు తగ్గడం మీద ప్రధానమైన ప్రభావం చూపుతాయి. మన తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రాట్లు ఎక్కువగా ఉంటే తొందరగా బరువు పెరగడానికి అవకాశం చాలా ఎక్కువ, కాబట్టి తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం తీసుకోవాలి. తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆకుకూరలు:

బరువు తగ్గాలనుకునేవారు ఆకుకూరలను ఎక్కువగా తినాలి. ఆకురాల్లో విటమిన్లు, ఖనిజాలు, మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. వీటిలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు తక్కవుగా ఉండే ఆహారంలో బచ్చలి కూర, కేల్, వంటివి ప్రధానమైనవి. ఈ ఆకురాల్లో క్యాలోరీలు తక్కువుగా ఉండి ఫైబర్ అధికంగా ఉంటుంది, దీని వలన ఎక్కువసేపు కడుపు నిండుగా అనిపిస్తుంది. ఆకురాల్లో శరీరానికి ఎంతో అవసరమైన ఐరన్, కాల్షియమ్, మరియు విటమిన్- ఏ,సి,కే వంటివి పుష్కలంగా ఉంటాయి, ఇవి ఆరోగ్యాన్ని పెంపొందించడంలో తోడ్పడతాయి.

గుడ్లు:

గుడ్లు ప్రోటీన్లకు అతి ముఖ్యమైన వనరు. గుడ్లలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్-బి, కోలిన్ వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉంటాయి. గుడ్లలోని మంచి కొవ్వులు, రక్తనాళాల్లో చెడు కొవ్వులు పేరుకుపోకుండా కాపాడతాయి. గుడ్లు తినడం ద్వారా ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్నట్లు ఉంటుంది. గుడ్లను ఉదయం లేదంటే వ్యాయామం చేసిన తరువాత తిన్నట్లైతే ఎంతో మంచిది. వీటిలో క్యాలోరిస్ తక్కువుగా ఉంటాయి కాబట్టి బరువుపెరుగుతారన్న భయం లేకుండా నిశ్చింతగా తినవచ్చు.

అవకాడో:

సలాడ్‌ లలో అవోకాడోను జోడించడం వల్ల రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. తక్కువ కార్బోహైడ్రేట్లు తీసుకోవాలని అనుకుంటే అవకాడో మంచి ఆప్షన్.

పండ్లు:

బరువు తగ్గాలనుకునేవారికి పండ్లు ఒక వరం. అయితే కొన్ని పళ్లలో కార్బోహైడ్రేట్లు ఎక్కువుగా ఉంటాయి కాబట్టి, అలోచించి పళ్ళను ఎంచుకోవాలి. స్ట్రాబెరి, బ్లూ బెర్రీ, వంటి బెర్రీలలో కార్బోహైడ్రేట్లు తక్కువుగా ఉంటాయి, కాబట్టి వీటిని నిశ్చింతగా తినవచ్చు. వీటిని తినడం ద్వారా ఫైబర్, విటమిన్లు, మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభ్సితాయి పుష్కలంగా లభిస్తాయి. వీటిని ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవడం ద్వారా బరువు తొందరగా తగ్గేందుకు వీలుంటుంది.

Share your comments

Subscribe Magazine