మనం రోజు తినే ఆహారంలో ఫైబర్ ఉండేలా చూసుకోవడం ఎంతో కీలకం. ఫైబర్ మన ఆహారం జీర్ణం కావడంలో తోడ్పడుతుంది. మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ ఉండటం వలన, బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి, అంతేకాకుండా మలబద్దకాన్ని నియంత్రణలో ఉంటాయి. సాధారణంగా ఒక మనిషికి ఒక రోజుకి 25-30 గ్రాముల ఫైబర్ అవసరం, కాకపోతే ఫైబర్ ని జీర్ణం చేసుకునే శక్తీ మన శరీరణకి ఉండదు అయినసరే ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి ఫైబర్ చాల అవసరం. ఐతే ఎటువంటి ఆహారంలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుందో వాటిగురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఓట్స్:
ఓట్స్ తినడం ద్వారా శరీరానికి అవసరమైన శక్తితో పాటు, కార్బోహైడ్రేట్స్ మరియు ఇతర ఖనిజాలు లభిస్తాయి. ఓట్స్ ధాన్యం లాగానే గడ్డిజాతికి చెందిన మొక్కలు. ఓట్స్ ఫైబర్ లభించడానికి గొప్ప మూలం. ఓట్స్ తినడానికి అనేక మార్గాలున్నాయి, వీటితో ఎన్నో రకాల వంటకాలు తయారుచేసుకోవచ్చు.
బ్రౌన్ రైస్:
ఈ మధ్యకాలంలో బ్రౌన్ రైస్ ప్రాచుర్యం బాగా పెరిగింది. బ్రౌన్ రైస్ కూడా మనం తినే సాధారణ బియ్యంలాగానే ఉంటాయి, కాకపోతే వీటిలో ఎక్కువ పోషకవిలువలు, మరియు అధిక మొత్తంలో ఫైబర్ ఉండటం వలన సాధారణ బియ్యకంటే ఆరోగ్యానికి మరింత మేలుచేస్తాయి. బ్రౌన్ రైస్ ని అన్నం లాగా, మరియు ఇతర వంటకాల్లో వాడొచ్చు.
క్వినోవా:
డైటింగ్ చేసేవారికి క్వినోవా అనే పేరు సుపరిచితమే. కొంతమంది పేషెంట్స్ కి వీటిని తినమని డాక్టర్స్ రికమెండ్ చేస్తారు. క్వినోవాని కంప్లీట్ సెరెల్ లేదా పూర్తి ధాన్యం అనికూడా పిలుస్తారు. వీటిలో ఫైబర్ మరియు ప్రోటీన్ తో పాటు తొమ్మిది అవసరమైన అమైనో ఆసిడ్స్ ఉంటాయి, ఇవి ప్రోటీన్ నిర్మాణంలో తోడ్పడతాయి. అయితే వీటిని ఎక్కువమొత్తంలో తినడం కష్టం కాబట్టి వీటిని అన్నానికి సైడ్ డిష్ గా , మరియు సలాడ్స్, సూప్స్ లో చేర్చుకుంటారు.
చిలకడ దుంపలు:
వీటిని స్వీట్ పొటాటోస్ అని కూడా పిలుస్తారు. పేరుకుతగ్గటే ఏవి కాస్త స్వీట్ గా ఉంటాయి. వీటిని తినడం ద్వారా శరీరానికి అవసరమైన ఫైబర్ తో పాటు పొటాషియం మరియు విటమిన్- ఏ లభిస్తాయి. సాధారణంగా వీటిని ఉడకబెట్టుకొని తింటారు. దీనితోపాటుగా వీటిని వేయించి, లేదా నిప్పుల మీద కాల్చి తింటారు. కొన్ని చోట్ల వీటితో కర్రీ కూడా తయారుచేస్తారు.
బీన్స్:
బీన్స్ తృణ ధాన్యాలకు చెందిన పంటలు. బీన్స్ ప్రోటీన్, ఫైబర్, ఐరన్ లభించడానికి గొప్ప మూలం. బీన్స్ ని కూరల్లో, సూపుల్లో, మరియు అనేక వంటకాల్లో వాడుకోవచ్చు.
కాయగూరలు, పళ్ళు:
ధాన్యాలు మరియు తృణధాన్యాలతో పాటు కూరగాయలు మరియు పళ్ళు మన ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాయగూరలు మరియు పళ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, దీనితోపాటు విటమిన్లు, ఖనిజాలు అధికంగా లభిస్తాయి. ఆహారంలో ధాన్యంకంటే కూరగాయాలే ఎక్కువ ఉండాలని డాక్టర్లు సూచిస్తారు.
-
జంక్ ఫుడ్ ఎక్కువుగా తింటున్నారా? అయితే కాస్త జాగ్రత్త
-
పొట్టలో గ్యాస్ సమస్య ఉందా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి
Share your comments