ఉదయాన్నే తినే బ్రేక్ ఫాస్ట్ లేదా అల్పహారం రోజు మొత్తం ఉత్సాతంతో పనిచేసే శక్తిని ఇస్తుంది. ఏదైనా కారణం చేత బ్రేక్ ఫాస్ట్ మానేస్తే ఆ రోజంతా డల్ గా నిరుత్సహాంగా ఉంటుంది. అందుకే తప్పని సరిగా ఉదయం అల్పాహారం తినడం తప్పనిసరి అని వైద్యులు సూచిస్తారు. ఉదయం అల్పాహారం క్రమం తప్పకుండ తినేవారిలో ఆసిడ్ సమస్యలు తక్కువుగా వస్తాయి. అయితే ఉదయానే బ్రేక్ ఫాస్ట్ లాగా అన్ని రకాల ఆహారాల్ని తినడం అంత మంచిది కాదు. అవి ఏమిటో ఇప్పుడు తెల్సుకుందాం.
ఘాటు ఎక్కువుగా ఉండే ఆహారం:
మనిషి నోరు ఎల్లపుడు రుచికరమైన ఆహారాన్ని కోరుకుంటుంది. అందులోనూ బాగా మసాలాలు దట్టించి, స్పైసి గా చేసిన ఆహారం అంటే చెవి కోసుకునే వ్యక్తులు ఉన్నారు. అయితే ఉదయాన్నే కాలికడుపుతో ఘాటు ఎక్కువుగా ఉండే ఆహారాన్ని తినడం అంత మంచిది కాదు. వంటకాల్లో ఘాటు రావడానికి వాడే మిర్చి లేదా మిరియాల్లో, కేపీసీసీన్ అనే కెమికల్ ఉంటుంది. దీని వలన కడుపులో మంట లేదా ఛాతిలో మంట వంటి లక్షణాలతో రోజంతా ఇబ్బందిగా ఉంటుంది.
కాఫీ:
కొన్ని మూవీస్ లో చూపించిన విధంగా, ఎంతో మంది ఉదయానే బెడ్ కాఫీ తాగే అలవాటు అలవరచుకున్నారు. కాఫీ తాగడం వలన రోజంతా ఫ్రెష్ గా ఉన్న దీర్ఘకాలికంగా అసిడిటీ వంటి సమస్యలకు ధారి తీసే అవకాశం ఉంటుంది.. కాఫీ తో పాటు ఉదయాన్నే టీ మరియు కూల్ డ్రింక్స్ తాగడం కూడా మంచిది కాదు, ఇవి ఛాతిలో మంట రావడానికి ప్రధాన కారణాలు.
డీప్ ఫ్రై చేసిన పదార్ధాలు:
డీప్ ఫ్రైడ్ టిఫిన్ అనగానే మైసూరు బొండాలు, వడలు వంటివి మన ఆలోచనకు వస్తాయి. ఇటువంటి డీప్ ఫ్రై చేసిన ఆహారాన్ని ఉదయానే తినడం వలన కడుపుపై వీటిని అరిగించడానికి అదనపు భారం పడుతుంది. వీటి బదులు తేలికగా జీర్ణమయ్యే, ఇడ్లిలు, ఓట్స్, గుడ్లు వంటివి తినడం శ్రేయస్కరం.
ఫ్రూట్ జ్యూస్ లు:
చాల మంది ఎక్సర్సిస్ అన్న పేరుతో ఉదయానే ఫ్రూట్ జ్యూస్ లు తెగ తాగుతుంటారు. పళ్ళ రసాలు శరీరానికి మంచివే అయినా వీటిలో ఆసిడ్ శాతం ఎక్కువ ఉండటం వలన పళ్ళ ఎనామెల్ పై ప్రాభవం చూపుతాయి. వీటి బదులు ఉదయాన్నే తేలికగా జీర్ణమయ్యి, ప్రోటీన్ మరియు ఫైబర్ ఎక్కువుగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది.
Share your comments