ప్రైవేట్ బీమా సంస్థ అయిన పీఎన్బీ మెట్లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ (PNB MetLife India Insurance) దేశం లోనే మొదటి సారిగా దంతాల కోసం ఒక బీమా పథకాన్ని ప్రారంభించింది.
మొత్తం దంత ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులకు ఆర్థిక సహాయాన్ని అందించే దిశగా దంత ఆరోగ్య భీమా పథకాన్ని ప్రవేశ పెట్టినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ రోజుల్లో చాలామంది వయసుతో సంబంధం లేకుండా దంత మరియు చిగురు సమస్యల తో బాధపడుతున్నారు. అయితే ఈ దంత చికిత్స కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది. మన దంతాలకు ఎటువంటి హానీ కలిగిన దాని చికిత్స కొరకు విపరీతంగా డబ్బులు ఆసుపత్రులకు చెల్లించాల్సి వస్తుంది.
దంతాల సమస్యలతో బాధపడుతున్న సామాన్యులకి వీటి ఖర్చును భరించడం కష్టతరంగా మారింది. అయితే పేద ,మధ్య తరగతి ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని పీఎన్బీ మెట్లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ (PNB MetLife India Insurance) ఈ సమస్యను అధిగమించడానికి దంతాల ఆరోగ్యం కొరకు బీమా అందించాలని నిర్ణయించిందని వెల్లడించింది.
డెంటల్ కేర్ ప్లాన్ యొక్క ముఖ్య ముఖ్యాంశాలు:
రాత్రిపూట ఆసుపత్రిలో చేరే ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం లేని విధంగా భీమా యాక్సెస్
ఒక్కో ప్రక్రియకు రూ.350 నుండి రూ.7500 వరకు స్థిర ప్రయోజనాలు మరియు 50,000 వరకు హామీ మొత్తం
డెంటల్ సర్వీస్ ప్రొవైడర్ల తో టై అప్
నగదు రహిత సౌకర్యం మరియు అందుబాటులో ఉండే విధంగా క్లెయిమ్ ప్రక్రియ
సెక్షన్ 80డి కింద పన్ను ప్రయోజనాల మినహాయింపులు
నిర్దిష్ట ఔట్ పేషెంట్ మరియు యాక్సిడెంటల్ డెంటల్ విధానాలకు స్థిర ప్రయోజనాలను చెల్లిస్తుంది.
మరిన్ని చదవండి.
Share your comments