Health & Lifestyle

వీటిని తిన్నారంటే మధుమేహం ఇక మీ కంట్రోల్ లో ఉన్నట్లే....

KJ Staff
KJ Staff

వర్షాకాలం వచ్చిందంటే చాలు, ఇంఫెక్షన్లు మరియు అంటు వ్యాధులు ఎక్కువైపోతాయి. ఈ కాలంలో చిన్న పిల్లలు మరియు పెద్దవారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బ్లడ్ షుగర్ మరియు బీపీ ఉన్నవారికి ఇది ఒక గడ్డు కాలం అని చెప్పవచ్చు. ఇప్పటివరకు ఉష్ణోగ్రతలు ఎక్కువుగా ఉంది ఒక్కసారిగా తగ్గిపోవడంతో వ్యాధుల భారిన పడేందుకు అవకాశం ఉంటుంది. ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఈ వర్షాకాలం మరియు రాబోయే చలికాలం షుగర్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. వ్యాధుల భారీ నుండి రక్షించుకోవడానికి పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి.

చల్లని వాతావరణంలో టైప్ 2 డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు ఆహారంలో కొన్ని రకాల మార్పులు చేయాల్సి ఉంటుంది. ఈ సీజన్ లో కూడా తాజా, రుచికరమైన పండ్లు, కూరగాయలు ఎన్నో దొరుకుతుంటాయి. ఈ పండ్లు, కూరగాయలను ప్రతిరోజు ఆహారంలో తీసుకున్నట్లైతే డయాబెటిస్ ను కంట్రోల్ చేసేందుకు అవకాశం ఉంటుంది. పండ్లు, కూరగాయల్లో పోషకవిలువలు, విటమిన్స్, మినరల్స్, పైబర్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరంలోని బ్లడ్ షుగర్ స్థాయిలను అదుపు చేస్తాయనడంలో సందేహం లేదు. దీర్ఘకాలంగా వేధించే డయాబెటిస్ కూడా చెక్ పెట్టవచ్చు, కొన్ని రకాల పళ్ళ ద్వారా చెక్ పెట్టచ్చు, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాబేజీ:

క్యాబేజి ఎన్నో రకాల పోషకాలకు మూలం. షుగర్ ఉన్నవారి డైట్లో క్యాబేజీ అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు. క్యాబేజీ లోని ఎన్నో రకాల పోషకాల విలువలు బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించడంలో ఎంతగానో సహాయపడతాయి. అంతేకాకుండా క్యాబేజీ తినడం ద్వారా ఈ కాలంలో వచ్చే అంటువ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు.

స్వీట్ పొటాటో:

చిలకడు దుంప, లేదా స్వీట్ పొటాటో, చలికాలానికి ఒక ఒక మంచి ఆహారంగా చెప్పుకోవచ్చు. బంగాలదుంప మాదిరిగానే ఉండే ఈ చిలకడ దుంపను ఉడకబెట్టి తినవచ్చు. యాంటి డయాబెటిక్ ఫుడ్ గా దీనికి పేరుంది. ఇందులోని న్యూట్రిషన్లు, ఫైబర్ సహా కెరోటిన్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడంతో పాటు బరువు తగ్గించడంలో కూడా ఎంతో సహాయపడుతుంది. జన్యు సంబంధిత కారణాలతో వచ్చే టైప్ -2 డయాబెటిస్ ను కూడా ఇది నియంత్రిస్తుంది.

నారింజ:

నారింజ పరిచయం అవసరం లేని పేరు. నారింజ సిట్రస్ జాతికి చెందిన పండు, దీనిలో విటమిన్-సి సంవృద్ధిగా లభిస్తుంది. సిట్రస్ జాతి ఫలాల్లో నిమ్మకాయ, ఆరెంజ్ సూపర్ ఫుడ్ గా చెప్పవచ్చు. డయాబెటిస్ రోగుల్లో బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసేందుకు ఈ పండు ఎంతగానో ఉపకరిస్తుంది. తేలికగా జీర్ణమయ్యే గుణం కలిగిన ఈ పండు రోజువారీ డైట్ లో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

జామ పండు:

జామపండు అందరికి అందుబాటులో ఉండే ఫలం కాబట్టి దీనిని పేదవారి ఆపిల్ అని కూడా పిలుస్తారు. జీర్ణసంబంధిత వ్యాధులకు జామ పండు అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. ఇందులోని ఆరోగ్యకర ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా చలికాలంలో అధికంగా తీసుకుంటే మంచిది. ఎక్కువ కాలం నిల్వ ఉండే ఈ జామ పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ ను మెరుగుపర్చేందుకు తోడ్పడుతుంది.

Share your comments

Subscribe Magazine