కాలం మారే కొద్దీ మన జీవన విధానంలో మరియు మన ఆహార అలవాట్లలో కూడా మార్పులు వచ్చాయి. ఈ ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు వలన మనిషి అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కుంటున్నాడు. ఈ అనారోగ్య సమస్యల్లో షుగర్ అనేది కూడా ఒక ముఖ్యమైన సమస్య. నేటి కాలంలో ఈ షుగర్ సమస్యతో బాధపడే జనాభా బాగా పెరిగిపోయింది. అయితే ఇటువంటి సమస్యలకు కేవలం మందులతోనే పరిష్కారం కాదు, కొన్ని రకాల ఫలాలను తిన్నా కూడా ఆ ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు.
ఈ షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు అన్ని రకాల ఆహారాలను తినకూడదు. అదేవిధంగా ఆహార నియమాలను కూడా పాటించాల్సి వస్తుంది. అయితే ఈ వ్యాధితో బాధపడే వారు పండ్లను తినకూడదని, వాటికీ దూరంగా ఉంటారు. ఐతే ఇది ఎంత వరకు నిజం, షుగర్ తో బాధ పడేవారు పండ్లను తినాలి అంటే ఎటువంటి వాటిని తినాలి.
పండ్లను తినడం వలన మన శరీరానికి అనేక రకాల పోషకాలు అందుతాయి. షుగర్ తో బాధ పడేవారు కూడా పండ్లను కచ్చితంగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు. షుగర్ వ్యాధి గ్రస్తుల్లో రక్త ప్రసరణ వ్యవస్థ చాలా తక్కువగా ఉంటుంది. రోగ నిరోధక వ్యవస్థ కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీంతో అవయవాలు దెబ్బతినడం, త్వరగా ఇన్ఫెక్షన్ ల బారిన పడడం వంటివి జరుగుతాయి. అలాగే షుగర్ ఉన్న వారిలో రక్తనాళాలు గట్టిపడడం, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా పేరుకుపోవడం వంటివి జరుగుతుంది.ఈ కొలెస్ట్రాల్ ను తొలగించడానికి ఉపయోగపడే పీచు పదార్ధాలు ఎక్కువగా పండ్లల్లో ఉంటాయి.
ఇది కూడా చదవండి..
రక్తం శుద్ధి చేసే మూలికలు ..
షుగర్ వ్యాధితో బాధపడేవారు మామిడి పండ్లను, పనస తొనలను, సపోటా, సీతాఫలం, అరటి పండ్లను, ఖర్జూర పండ్లను ఎక్కువగా తీసుకోకూడదు. వీటిని తీసుకున్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిల వెంటనే పెరుగుతాయి. వీటిలో పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కనుక వీటిని తీసుకున్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
అలాగే పుచ్చకాయ, కర్బూజ, బొప్పాయి, కమలా పండ్లు, జామ పండ్లు, పైనాపిల్, ఆపిల్, దానిమ్మ వంటి పండ్లను షుగర్ వ్యాధి గ్రస్తులు ఎటువంటి సందేహం లేకుండా తీసుకోవచ్చు. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కనుక ఈ పండ్లను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే పెరగకుండా ఉంటాయి. మొత్తానికి పండ్లను తినడం మానేయకుండా ఇటువంటి పండ్లను తినడం వలన చాల మేలు జరుగుతుంది.
ఇది కూడా చదవండి..
Share your comments