Health & Lifestyle

కాల్షియమ్ సంవృద్ధిగా లభించే పళ్ళు ఇవే....

KJ Staff
KJ Staff

ఎముకుల పటుత్వానికి మరియు దంతాల ఆరోగ్యానికి కాల్షియమ్ చాలా కీలకం, కాల్షియమ్ మనం తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి, ఈ కాల్షియమ్ ఎన్నో రకాల ఆహారపదార్దాలలో మనకు లభిస్తుంది, వాటిలో పాల ఉత్పత్తుల్లో ఈ కాల్షియమ్ ఎక్కువుగా ఉంటుంది, మరియు మాంసాహారంలో కూడా కాల్షియమ్ సంవృద్ధిగా ఉంటుంది, కానీ పాలను అరిగించుకోగల సామర్ధ్యం లేనివారు, శాకాహారులు వీటిని తినలేరు, అటువంటి వారికోసం కాల్షియమ్ అధికంగా ఉన్న పళ్ళు కూడా ఉన్నాయి, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక మనిషికి ఒక రోజుకి సుమారు 1000 మిల్లి గ్రాముల కాల్షియమ్ అవసరం ఉంటుంది. కాల్షియమ్ ఎక్కువుగా పాల ఉత్పత్తుల్లో, గుడ్లు, మరియు ఇతర ఆహారపదార్ధాలో ఈ కాల్షియమ్ ఎక్కువుగా ఉంటుంది, అయితే శాకాహారులు వీటిని తినలేరు, శరీరంలో కాల్షియమ్ లోపిస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు తలైతే ప్రమాదం ఉంటుంది, వీటిలో ఎముకలు బలహీనపడటం, కీళ్ల నొప్పులు, చిగుళ్ల వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. శాకాహారులు కోసం కాల్షియమ్ పుష్కలంగా లభించే పళ్ళు చాలా ఉన్నాయి, అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కాల్షియమ్ అధికంగా లభించే పళ్లలో నారింజ మొదటిది, ప్రతి 100 గ్రాముల నారింజలో 45-50 మిల్లీగ్రాముల కాల్షియమ్ లభిస్తుంది. అంతేకాకుండా వీటిలో యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్-సి పుష్కలంగా లభిస్తాయి కాబట్టి రోగాల భారిన పడకుండా రక్షించగలిగే సామర్ధ్యం ఉంది. కాల్షియమ్ సంవృద్ధిగా లభించే పళ్లలో ఆప్రికాట్ ఒకటి, ఆప్రికాట్ కాల్షియమ్ పొందడానికి మూలం, ప్రతి 100 గ్రాముల ఆప్రికాట్ లో సాధారణంగా 15 గ్రాముల కాల్షియమ్ ఉంటుంది.

మన దేశంలో అరటిపళ్ళ లభ్యతకు కోరవే లేదు, అంతేకాకుండా ఇవి అందరికి అందుబాటు ధరలోనే లభిస్తాయి, అంతేకాకుండా కాల్షియమ్ అందించడంలో ఒక చక్కటి వనరు. అరటిపండులో సుమారు 8 మిల్లీగ్రాముల కాల్షియమ్ ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అరటి పండు ద్వారా లభించే ఫైబర్ జీర్ణక్రియ మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతుంది, అలాగే రక్తంలో చెక్కర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

స్ట్రాబెర్రీలు కూడా కాల్షియమ్ అందించడంలో ఎంతగానో తోడ్పడతాయి, ప్రతి 100 గ్రాముల స్ట్రాబెర్రీలలో 16 మిల్లీగ్రాముల ప్రోటీన్ లభిస్తుంది, అంతేకాకుండా వీటిలో సంవృద్ధిగా ఉండే విటమిన్-సి రోగాల భారిన పడకుండా ఉండేందుకు సహాయపడుతుంది. పైన పేర్కొన్న పళ్ళను తరచూ తినడం ద్వారా కాల్షియమ్ లోపాన్ని సరిచేసుకోవచ్చు, కాల్షియమ్ శరీరానికి అవసరమైనప్పటికీ, అధిక మొత్తంలో తీసుకుంటే కిడ్నీ లో రాళ్ళూ ఏర్పడేందుకు ఆస్కారం ఉంటుంది, కాబట్టి వినియోగదారులు జాగ్రత్త పాటించాలి.

Share your comments

Subscribe Magazine