Health & Lifestyle

విటమిన్-బి12 లోపానికి ఈ పళ్లతో చెక్ పెట్టండి......

KJ Staff
KJ Staff

మనకు అవసరమైన అతిముఖ్యమైన విటమిన్లలో, బి12 విటమిన్ ఒకటి. విటమిన్ బి12 ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయి, ఈ విటమిన్ శరీరంలో కండరాల అభివృద్ధికి మరియు ఎముకుల పటుత్వానికి దోహదపడుతుంది. శరీరం మొత్తం ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ఉపయోగపడేవి ఎర్ర రక్త కణాలు, వీటి ఉట్పతిచెయ్యడంలో విటమిన్ బి12 ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా మానసిక వికాసానికి విటమిన్ బి12 ఎంతగానో తోడ్పడుతుంది.

ఒకవేళ విటమిన్ బి12 కనుక లోపించినట్లైతే ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముందుగా ఈ యొక్క విటమిన్ లోపం వలన రక్తహీనత ఏర్పడుతుంది, దీని మూలంగా తొందరగా అలసిపోవడం, ఎల్లపుడు నీరసంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చేతులు, కళ్లలో బలహీనత మరియు తిమ్మిర్లు రావడం గమనించవచ్చు. పైగా విటమిన్ లోపం ఉన్నవారిలో మానసిక ఆరోగ్యంగా కూడా దెబ్బతింటుంది, దీనిమూలంగా దిగులుగ, నిరాశ మరియు ఒంటరితనంతో వ్యక్తి సతమతమవ్వడం గమనించవచ్చు. ఈ లోపాన్ని ముందుగానే గుర్తించి నివారించడం చాలా అవసరం లేకుంటే ఎన్నో తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

విటమిన్ బి12 లోపం ఉన్నవారు డాక్టర్ల సూచనా మేరకు విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవచ్చు అయితే ప్రకృతి మనకు ప్రసాదించిన అనేక రకాల పళ్ళ ద్వారా కూడా ఈ విటమిన్ లభిస్తుంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా పళ్లలో రారాజుగా పిలవబడే మామిడి పండు. మామిడి పళ్ళు విటమిన్ బి12 కి ప్రధానమైన వనరుగా చెప్పుకోవచ్చు, ప్రస్తుతం మామిడి పళ్ళ సీసన్ నడుస్తుండటం వలన వీటిని ప్రతీ రోజు తినవచ్చు. మామిడి పళ్ళను తినడం ద్వారా విటమిన్ బి12 లోపం తీరడంతోపాటు, శరీరానికి అవసరమైన ఇతర విటమిన్లు మరియు ఫైబర్ లభిస్తాయి.

విటమిన్-బి12 పుష్కలంగా లభించే పళ్లలో ఆపిల్ ఒకటి. ప్రతి రోజు ఒక ఆపిల్ తినడం ద్వారా ఆనారోగ్య సమస్యలకు దూరం కావచ్చని ఒక నానుడి కూడా ఉంది. ఆపిల్ లో అనేక రకాల విటమిన్లు మరియు ఇతర పోషకాలు అధికంగా ఉండటం వలన ఆరోగ్యంగా ఉండేందుకు వీలుంటుంది. ఆపిల్ తోపాటు విటమిన్లు అధికంగా లభించే పళ్లలో పైన్ ఆపిల్ ఒకటి, విటమిన్ బి12 లోపం ఉన్నవారిలో పైన్ ఆపిల్ ఈ లోపాన్ని భర్తీ చెయ్యగలదు. పైన్ ఆపిల్ జీర్ణక్రియను మెరుగుపరచడంలోనూ మరియు శరీరాన్ని శుద్ధి చెయ్యడంలోనూ తోడ్పడుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు పైన్ ఆపిల్ తినడం వలన కొలెస్ట్రాల్ స్థాయి కూడా తగ్గుతుంది. కనుక ఈ పళ్ళను తరచూ మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా విటమిన్- బి12 లోపాన్ని జయించి ఆరోగ్యవంతమైన జీవితం జీవించవచ్చు.

Share your comments

Subscribe Magazine