Health & Lifestyle

గార్డెన్ మొక్కల పెంపకంతో మతిమరుపు మాయం!

KJ Staff
KJ Staff
Gardening Therapy
Gardening Therapy

ఇంటి అవరణలో (గార్డెన్) మొక్కలు పెంచుకుంటే అక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అందులో రంగురంగుల మొక్కలు పెంచితే మరింత ఆకర్షణీయంగా అందరినీ అకట్టుకుంటుంది. గార్డెన్ మొక్కల పెంపకం వల్ల అనేక రకాల ప్రయోజనాలు సైతం కలుగుతాయి. రకరకాల పూలుమొక్కలు, పండ్ల మొక్కలు పెంచడం వల్ల అవి మనకు తాజాగా ఉంటే పూలు, పండ్లు సైతం అందిస్తాయి. కేవలం అవి అందించే పూలు, పండ్లతో పాటు మన మానసిక వికాసానికి సైతం గార్డెన్ మొక్కల పెంపకం ఎంతగానో తొడ్పడుతుందని తాజాగా ఓ అధ్యయనం ద్వారా వెల్లడైంది.

గార్డెన్ మొక్కల పెంపకం.. మనుషులపై ప్రభావం.. కలిగే లాభాలకు సంబంధించిన అంతర్జాతీయంగా పలువురు పరిశోధకులు ఓ అధ్యయనం నిర్వహించారు. దీనిలో భాగంగా నెదర్లాండ్స్, నార్వే దేశాల్లో పలువురితో పాటు మానసిక, శారీరక రోగులపై పరిశోధనలు నిర్వహించారు. మీరు మొక్కల పెంపకంలో పాలు పంచుకోవడం వల్ల వారిలో చోటుచేసుకున్న పరిస్థితులను పూర్తిగా పరిశీలించి ఓ నివేదికను తయారు. చేశారు. ఈ పరిశోధన నివేదికలోని వివరాల ప్రకారం.. గార్డెన్ లో మొక్కల పెంపకంతో మతిమరుపు మాయం అవుతుందని అధ్యయనం పేర్కొంది. మొక్కల పెంపకానికి సంబంధించి గార్డెన్ లో నేలను మొక్కలు నాటడానికి సిద్ధం చేయడం, నాటిన మొక్కలకు నీరు పోయడం, వాటి మొదళ్ల చుట్టూ పాదులు చేయడం, కలుపు తీయడం వంటి పనులు చేయడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని అధ్యయనం తెలిపింది. 

ఈ అధ్యయనంలో భాగంగా మతిమరుపు సమస్య ఉన్న రోగులను గార్డెన్ పనులు చేయించారు. గార్డెన్ లో మొక్కల పెంపకం సంబంధిత పనులు చేయడం వల్ల వారిలో జ్ఞాపకశక్తి చాలా మెరుగుపడింది. అలాగే, అనేక రకాల మానసిక వ్యాధుల ప్రభావం గార్డెన్ లో మొక్కలు పెంపకం ద్వారా తగ్గిపోతున్నట్టుగా పరిశోధనలో వెల్లడైంది. మొక్కల పెంపకం పనుల్లో ఉన్న రోగుల్లో ఒత్తిడి సైతం తగ్గిందని పరిశోధకులు పేర్కొన్నారు. మానసిక రోగులకు హార్టీకల్చర్‌ థెరపీ వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని తమ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయని వెల్లడించారు. రోజురోజుకూ కాలుష్యం పెరుగుతున్న భూ వాతావరణ ప్రభావం సమతూల్యంగా ఉండటానికి మొక్కలు నాటాల్సిన అవసరం చాలా ఉందనీ, ఖాళీ స్థలం ఉన్న చోట మొక్కలు నాటాలనీ, ఉన్న చెట్లను నరకకుండా కాపాడాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.

Share your comments

Subscribe Magazine