సాధారణ వాతావరణంలో మార్పులు జరగడం సర్వసాధారణం. అయితే ఉన్నఫలంగా వాతావరణంలో ఇలా మార్పులు చోటుచేసుకోవడంతో అనేక వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే చాలు ఎన్నో రకాల అంటువ్యాధులను వెంట తీసుకొని వస్తాయి.అయితే ఈ విధంగా వర్షాకాలంలో వచ్చేటటువంటి సీజనల్ వ్యాధులలో దగ్గు జలుబు ఎక్కువగా బాధిస్తుంది. వర్షాకాలంలో వచ్చేటటువంటి వివిధ రకాల వ్యాధులను అరికట్టే వాటిలో శొంఠి ఒక దివ్యౌషధమని చెప్పవచ్చు.
వర్షాకాలంలో ఎక్కువగా వ్యాపించే అంటువ్యాధులలో జలుబు, దగ్గు ఒకటి. ఈ విధమైనటువంటి సమస్యతో బాధపడేవారు శొంఠి పొడిని నీళ్లలో కలిపి ఆ నీటిని మరగబెట్టి తాగటం వల్ల తొందరగా జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. అదేవిధంగా మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సొంటి కీలక పాత్ర పోషిస్తుంది.
శొంఠి పొడిలో ఎన్నో ఔషధగుణాలు దాగి ఉన్నాయి. ఔషధ గుణాలు మనలో ఉన్నటువంటి వివిధ రకాల అంటువ్యాధులు అరికట్టడానికి, మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన శొంఠిని తీసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఇక్కడ తెలుసుకుందాం..
నిజాం కాలం నాటి బస్సు ను చూడడానికి ఎగబడిన జనం ...!
విష జ్వరాలు వచ్చినప్పుడు శొంఠి పొడిని మేక పాలతో కలిపి తీసుకుంటే ఈ విష జ్వరాల నుంచి ఉపశమనం పొందవచ్చు. గ్యాస్ సమస్యతో బాధపడేవారు పావు చెంచా శొంఠిపొడిని ఒక చెంచా తేనెతో కలిపి తీసుకుంటే గ్యాస్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. తీవ్రమైన తలనొప్పితో బాధపడేవారు శొంఠిపొడిని నీటిలో కలిపి తలకు రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. రక్తహీనత సమస్యలకు కూడా శొంఠిపొడితో చెక్ పెట్టవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
Share your comments