ప్రతి రోజూ ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మన శరీర పెరుగుదలకు అవసరమైన ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, మినరల్స్, కొవ్వులు సమృద్ధిగా లభిస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రోజూ మనం తాగే ఆవుపాలు, గేదెపాల కంటే మేక పాలల్లోనే అధిక మొత్తంలో కాల్షియం, మాంసకృత్తులు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండి మనకు శక్తి నివ్వడమే కాకుండా,మన ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తాజా అధ్యయనం వెల్లడిస్తోంది.మేక పాలల్లో ఉన్న పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం
ఆవు పాల కంటే మేక పాలల్లో ఎముకల
పటుత్వాన్ని పెంచే విటమిన్ డి, క్యాల్షియం సమృద్ధిగా లభిస్తాయి. కావున ప్రతి రోజు మేక పాలు తాగితే వయస్సు మళ్లిన తర్వాత వచ్చే కీళ్ల నొప్పులు, రుమటాయిడ్ ,అర్థరైటిస్ వంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.మేక పాలలో ఉండే ఫ్యాట్ మొలిక్యూల్స్ తేలికగా జీర్ణమయ్యేలా చేస్తాయి. కావున జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు మేక పాలను తాగడం మంచిది.
శుభవార్త :వంటనూనె లీటర్ కు 15 రూపాయలు తగ్గించాలని ఆదేశించిన కేంద్రం
మేక పాలలో అధికంగా ఉండే సెలెనియం మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. తద్వారా అనేక రకాల క్యాన్సర్ కారకాలను నిర్మూలించవచ్చు. మేక పాలలో విటమిన్ A,E అధికంగా ఉండటం వల్ల చర్మ సమస్యలు తొలగి చర్మంపై కొత్త కణాలు వచ్చేలా చేస్తాయి. మేక పాలను కొబ్బరిపాలతో కలిపి ముఖాన్ని శుభ్రం చేసుకుంటే పాలలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ముఖంపై మచ్చలు, మొటిమలను పోగొడతాయి. ప్రతిరోజు మేక పాలు తాగితే ఎర్ర రక్త కణాల అభివృద్ధి పుష్కలంగా ఉంది ప్రమాదకర ఆనీమియా వ్యాధిని దూరంగా ఉండవచ్చు.
Share your comments