Health & Lifestyle

గోల్డెన్ బ్లడ్ గ్రూప్ గురించి ఎప్పుడైనా విన్నారా ?

Srikanth B
Srikanth B
గోల్డెన్ బ్లడ్ గ్రూప్ గురించి ఎప్పుడైనా విన్నారా ?
గోల్డెన్ బ్లడ్ గ్రూప్ గురించి ఎప్పుడైనా విన్నారా ?

సాదారణముగా దేశ జనాభాలో 95 శాతం ప్రజలు 4 రకాల సాధారణ రక్త గ్రూపులను కలిగివుంటారు . ఇందులో భారత దేశంలో 35 శాతం 'o' బ్లడ్ గ్రూప్ ,'B 'బ్లడ్ గ్రూప్ 32 శాతం మందికి 22 శాతం "A ' బ్లడ్ గ్రూపును కలిగివున్నారు . అయితే వీటికి తోడు 3 భిన్నమైనబ్లడ్ గ్రూపును ప్రజలు కలిగివున్నారు , వీటికి అదనంగా ఇటీవలి కాలంలో మరొక బ్లడ్ గ్రూప్ ,"Golden బ్లడ్ గ్రూప్ ప్రపంచ వ్యాప్తముగా చర్చకు దారితీసింది .

గోల్డెన్ Blood Group గురించి : ప్రపంచంలో 45 మందిలో మాత్రమే ఈ బ్లడ్ గ్రూప్ కల్గి వున్నారు మొదటగా ఈ బ్లడ్ గ్రూప్ ను 1961 గ్రీసు కు చెందిన ఒక వ్యక్తిలో కనుగొన్నారు . రక్త కణంపైనా ఎటువంటి Rh జనకం లేకపోవడం ద్వారా దీనికి గోల్డెన్ Blood Group గ పిలుస్తారు . సాదారణముగా ప్రతియొక్క రక్త సమూహం దానికి అంటుకొనివున్న జన్యువాహకం ఆధారముగా రక్తకణాలను వర్గీకరిస్తారు . అయితే ప్రపంచ వ్యాప్తముగా ఆధారముగా చేసుకొని 4 రకాల రక్త వర్గాలను విభజించారు . ఇవికాకుండా తరువాతి కాలంలో భిన్నమైన 3 రక్త వర్గాలను కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు . 1961 లో కనుగొనబడిన గోల్డెన్ Blood Group అరుదైనది అని శాస్తవేత్తలు తెలిపారు .

భారత దేశంలోని అరుదైన రక్తసమూహాలు :B నెగటివ్ (B -ve), ఇది మొత్తం జనాభాలో 1.5 శాతం మందిలో కనిపిస్తుంది. AB నెగటివ్ (AB-ve), ఇది మొత్తం జనాభాలో 0.6 శాతం మందిలో . AB పాజిటివ్ (AB +ve), ఇది మొత్తం జనాభాలో 3.4 శాతం గ ఉన్నది .

తెలంగాణలో 18% మందిలో డయాబెటిస్: వెల్లడించిన జాతీయ ఆరోగ్య సర్వే

గోల్డెన్ Blood Group గురించి :
మనుషులలో ఈ రక్త వర్గం ఉండడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది 'జెనెటిక్ మ్యుటేషన్' కారణంగా ఇది ఒక తరం నుంచి మరొక తరానికి బదిలీ అవుతుంది. 'నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్'లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. చాలా సన్నిహిత సంబంధాల మధ్య, ముఖ్యంగా బంధువులు, తోబుట్టువులు లేదా ఇతర బంధువుల మధ్య వివాహం కారణంగా గోల్డెన్ Blood Group క్రమంగా పెరిగే అవకాశం ఉందని శాస్త్ర వేత్తలు వెల్లడించారు .

అయితే ఈ గోల్డెన్ Blood Group వారికీ ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినపుడు రక్తం దొరికే అవకాశం చాల తక్కువగ ఉండడంతో దీని రేటుకూడా ప్రపంచంలోనే అధిక ధరను కలిగివుంది మీడియా కథనాలప్రకారం దీని ధర ఒకగ్రాముకు బంగారం ధరకంటే ఎక్కువగానే వుంది .

నేటితో ప్రపంచ జనాభా 800 కోట్లు .. !

Related Topics

Blood group

Share your comments

Subscribe Magazine