సకల పోషక విలువలు కలిగి ఏడాది పొడవునా అన్ని సీజన్లలోను, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలో ఉండే అరటి పండ్లు సాధారణంగా పసుపు, లేదా ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే.మార్కెట్లో కూడా మనకు ఈ విధమైనటువంటి పసుపు రంగు కలిగినటువంటి అరటిపండ్లు ఎక్కువగా దొరుకుతాయి. అయితే చూడగానే నోరూరించే నీలిరంగు అరటిపండ్లను మీరెప్పుడైనా చూశారా. బహుశా చాలామంది చూసి ఉండకపోవచ్చు. ప్రస్తుతం నీలిరంగు వెరైటీ అరటి పండ్లు చల్లగా ఉండి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాలైన ఆగ్నేయ ఆసియా, హవాయి దీవులు, దక్షిణ అమెరికాలోని టెక్సాస్, ఫ్లోరిడా, కాలిఫోర్నియా, లూసియానా వంటి ప్రాంతాల్లో మాత్రమే ఈ పంటను సాగు చేస్తూ అధిక దిగుబడులను సాధిస్తున్నారు.
అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో మాత్రమే పండే విభిన్నమైన నీలిరంగు అరటి పండ్ల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. పసుపు పచ్చని అరటిపండ్లు మాదిరిగానే ఈ నీలిరంగు అరటిపండ్లలో కూడా అనేక పోషక విలువలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ నీలిరంగు అరటి పంటకు మార్కెట్లో బాగా డిమాండ్ ఏర్పడింది.ఈ క్రమంలోనే రైతులు కూడా నీలిరంగు అరటిపండు సాగు చేయడానికి ఎంతో విశిష్టత చూపుతున్నారు.
ఈ నీలిరంగు అరటి చెట్టు దాదాపు 6 మీటర్ల ఎత్తు పెరిగి,నాటిన15 నుంచి 20 నెలల మధ్య గెలలు వేయడం ప్రారంభిస్తుంది.కాయ సైజు దాదాపు ఏడు అంగుళాలు ఉంటుంది.సాధారణ పసుపు రంగు అరటిపండ్లు మాదిరిగానే నీలిరంగు అరటి పండ్లను కూడా తినడానికి ఉపయోగిస్తారు. అయితే ఈ నీలి రంగు అరటిపండ్లు రుచికి వెనిలా ఐస్ క్రీమ్ రుచి కలిగి ఉంటుందట. అందుకే దీనిని ఐస్ క్రీమ్ అరటి అని కూడా అంటారు. అలాగే ఈ నీలిరంగు అరటిని కెర్రీ, హవాయి అరటి వంటి పేర్లతో కూడా పిలుస్తారు.
Share your comments