మామిడి పండ్లంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరేమో.. ఈ పండ్లను మన దేశంలో 25 మిలియన్ సంవత్సరాల నుంచి పండిస్తున్నారు. అందుకేనేమో వీటిని పండ్లకు రారాజుగా పిలుస్తారు.
ఈ పండ్లు మన దేశంలోనే పుట్టాయి. ప్రపంచమంతా వ్యాపించాయి. మన దేశంలో ఎంతో పాపులర్ అయిన ఈ రుచికరమైన పండ్లను తినడం వల్ల రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా.
మామిడిలోని పోషకాలు
ఒక కప్పు మామిడి పండు ముక్కలు (165గ్రా) లో ఉండే పోషకాలు..
క్యాలరీలు - 99
ప్రొటీన్ - 1.35 గ్రా
కార్బొహైడ్రేట్లు - 24.7 గ్రా.
ఫైబర్ - 2.64గ్రా
ఫ్యాట్ - 0.627గ్రా
షుగర్ - 22.5గ్రా
మామిడి పండులో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫోలేట్, క్యాల్షియం, సోడియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్, నియాసిన్ వంటివి చాలా ఉంటాయి. మామిడి పండు చాలా రుచిగా ఉంటుంది. దీనివల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందుతాయి.
మామిడి పండు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు
రోగ నిరోధక శక్తి పెరగడం..
మామిడి పండ్లలో ఎన్నో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. రోజూ ఒక మామిడి పండు తింటే చాలు.. రోజుకి కావాల్సిన విటమిన్ సి లో రెండు వంతులు లభిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
గుండె జబ్బులు తగ్గుతాయి.
మామిడి పండులో మంచి మోతాదులో ఫైబర్ ఉంటుంది. పొటాషియం, విటమిన్లు వంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ రక్తనాళాల పనితీరు మెరుగుపరుస్తాయి. గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తాయి. దీన్ని మీ డైట్ లో భాగం చేసుకుంటే చాలు.. శరీరంలోని కొవ్వు కూడా తగ్గుతుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయులను కూడా కంట్రోల్ చేస్తుంది. బీటా కెరోటిన్ కి ఇది మంచి నెలవు. ఇవన్నీ కలిసి మామిడి పండ్లు రెగ్యులర్ గా తీసుకునేవారిలో గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తాయి.
కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మామిడి పండ్లలో ఎక్కువగా ఉండే బీటా కెరోటిన్, విటమిన్ ఎ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. విటమిన్ ఎ తక్కువగా ఉండడం వల్ల కంటిచూపు లోపాలు ఎదురవుతాయి. మామిడి పండ్లలో జియాంథిన్, ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులోని ల్యూటిన్ కూడా కంటి చూపును మెరుగుపరుస్తుంది.
చర్మ సమస్యలు తగ్గుతాయి.
మామిడిలో కెరోటినాయిడ్స్, టర్పెనాయిడ్స్, పాలీఫినాల్స్, ఆస్కార్బక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు వంటివి చర్మ క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. అంతేకాదు.. చర్మంలో తేమను మెయింటెయిన్ చేసేందుకు, యువీ కిరణాల నుంచి రక్షించేందుకు, చర్మ ఛాయను మరింత తెల్లగా మార్చేందుకు, ముడతలు, మచ్చలు తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. చర్మంలో కొల్లాజెన్ స్థాయులను కూడా ఇది పెంచుతుంది.
మన దేశంలో ఎన్నో రకాల వెరైటీల మామిడి పండ్లు దొరుకుతాయి. చాలామందికి మామిడి పండ్లంటే చాలా ఇష్టం. ఎంతగా అంటే ఒకేసారి నాలుగైదు పండ్లను తినేస్తారు. కానీ ఎంత మంచివైనా ఎక్కువ పండ్లను ఒకేసారి తినడం అంత మంచిది కాదు. ఇందులో ఎన్నో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. కానీ మితంగా తినడం వల్ల ప్రయోజనాలు అందుతాయి. అదే ఎక్కువగా తింటే దుష్ప్రభావాలు ఎదురవుతాయి. మామిడి పండ్లను ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి చెడు ప్రభావాలు ఎదురవుతాయంటే..
* మామిడి పండ్లను ఎక్కువగా తినడం వల్ల వల్ల డయేరియా సమస్య ఎదురవుతుంది. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా తీసుకుంటే మలబద్ధకాన్ని తగ్గించే ఈ మామిడి పండ్లు ఎక్కువగా తీసుకుంటే డయేరియాను కలిగిస్తుంది.
మామిడి పండ్లను ఎక్కువగా కార్బైడ్ వేసి పండిస్తారు. ఈ క్యాల్షియం కార్బైడ్ అనేది ఓ హానికరమైన కెమికల్. దీన్ని వేసి పండించిన పండ్లు ఎక్కువగా తింటే అది శరీరంలోకి చేరి ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలను తీసుకొస్తుంది.
* డయాబెటిక్ పేషంట్లలో షుగర్ లెవల్స్ తగ్గించేందుకు మామిడి పండ్లు ఉపయోగపడినా.. వీటిని ఎక్కువగా తినడం వల్ల ఇందులోని సహజమైన చక్కెరలు వారి రక్తంలోని చక్కర స్థాయులను పెంచుతాయి.
* మామిడి పండ్లు ఎక్కువగా తినడం వల్ల శరీరానికి వేడి చేస్తాయి. అంతేకాదు.. వీటిని ఎక్కువగా తినడం వల్ల మొటిమలు, రాషెస్, కడుపు నొప్పి వంటివి ఎదురవుతాయి.
* మామిడి కాయలను ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు ఎదురవుతాయి.
* కొంతమందికి మామిడి పండ్ల ఎలర్జీ ఉంటుంది. ఇలాంటివారిలో కంటిలో నీళ్లు రావడం, ముక్కు కారడం, శ్వాస సమస్యలు వంటివి ఎదురవుతాయి.
* బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే మామిడి పండ్లను తక్కువగా తీసుకోవాలి. దీనివల్ల క్యాలరీలు ఎక్కువగా అంది బరువు పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది.
https://krishijagran.com/agripedia/all-about-cultivation-and-production-of-mango-in-india/
Share your comments