Health & Lifestyle

బీరకాయను మీ ఆహారంలో చేర్చుకొని... మరియు ఈ లాభాలన్నీ పొందండి...

KJ Staff
KJ Staff

దాదాపు అన్ని సీసాన్లలో మార్కెట్లో కనిపించే కూరగాయల్లో బీరకాయ ఒకటి. బీరకాయ ఎన్నో పోషకాలకు నిలయం. దీనిని ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు. బీరకాయలో శరీరానికి అవసరమైన అతిముఖ్యమైన పోషకాలు అందుబాటులో ఉంటాయి, వీటిలో విటమిన్- ఏ, సి, బి తో పాటు పొటాషియం, మెగ్నీషియం, మరియు కాల్షియమ్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. వీటి ద్వారా శరీరం పనితీరు పెరిగి ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడతాయి.

బీరకాయ సహజసిధమైన ఫైబర్ కు నిలయం. ఎండిన బీరకాయలోని పీచుతో స్క్రబ్బర్లు కూడా తయారుచేస్తారు. బీరకాయలో ఉండే పీచు పదార్ధాలు పొట్ట ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ ఫైబర్ జీర్ణ క్రియను మెరుగుపరిచి ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తుంది. మలబద్దకం ఉన్నవారికి ఈ ఫైబర్ చక్కగా ఉపయోగపడి మలబద్దకం తగ్గేలా చేస్తుంది. బరువు తగ్గాలి అనుకునేవారు బీరకాయను తినడం మంచిది, ఫైబర్ కడుపు నిండిన భావని కలిగిస్తుంది కాబట్టి ఆహారం తక్కువ తింటారు. అంతేకాకుండా ఈ ఫైబర్ రక్తంలోని చెక్కెర స్థాయిని నియంత్రించి షుగర్ లెవెల్స్ పెరగకుండా కాపాడుతుంది.

బీరకాయలో విటమిన్-సి ఉండటం వలన ఇది శరీరానికి రోగనిరోధక శక్తిని ఇస్తుంది. విటమిన్-సి ఇన్ఫెక్షన్లతో పోరాడి రోగాల భారిన పడకుండా ఉండేందుకు తోడ్పడుతుంది. విటమిన్-సి ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ సంఖ్యను తగ్గించి, శరీరానికి నష్టం వాటిల్లకుండా కాపాడుతుంది. దీనితోపాటు గుండెజబ్బులు రాకుండా కాపాడే గుణం ఈ యాంటిఆక్సిడెంట్లకు ఉంది.

Share your comments

Subscribe Magazine