ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా కరోనా వంటి భయంకరమైన మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి మన శరీరంలో సరైన రోగ నిరోధక శక్తి ఉండటం ఎంతో అవసరం.ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ వారి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందింపజేసే ఆహారాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ విధంగా మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించే కూరగాయలలో బోడ కాకరకాయ ఒకటి.
వర్షాకాలంలో అటవీ ప్రాంతంలో పండే ఈ బోడ కాకరకాయలకు మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉంది.కేవలం ఈ సీజన్లో మాత్రమే లభించే ఈ కాకరకాయలను తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.మరి ఎన్నో ఔషధగుణాలు దాగి ఉన్న ఈ బోడ కాకరకాయలను తినడం వల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం...
*బోడ కాకరకాయను కొన్ని ప్రాంతాలలో కొన్ని రకాల పేర్లతో పిలుస్తారు. ఈ కాకరకాయలో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, విటమిన్ ఎ, విటమిన్ బి 1, బి 2, బి 3, బి 5, బి 6, బి 9, బి 12, విటమిన్ సి, విటమిన్ డి 2, 3, విటమిన్ హెచ్, విటమిన్ కె, కాల్షియం, పుష్కలంగా లభిస్తాయి.
*బోడ కాకర కాయలు తినడం వల్ల ఈ పోషకాలు మన శరీరానికి అందే తీవ్రమైన తలనొప్పి, జుట్టు రాలడం, చెవి నొప్పి, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.
*డయాబెటిస్, అధిక రక్తపోటు, పక్షవాతం, పాము కాటు, కంటి సమస్య, క్యాన్సర్, రక్తపోటు వంటి అనేక భయంకరమైన వ్యాధులలో దీనిని విరివిగా ఉపయోగిస్తారు.
*బోడ కాకర కాయలు మాత్రమే కాకుండా ఈ చెట్ల వేర్లు, ఆకుల రసాన్ని కూడా వివిధ రకాల ఆయుర్వేద మందులలో ఎన్నో రకాల జబ్బులకు ఉపయోగిస్తారు..
*ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ కాకరకాయ మార్కెట్లో సుమారు 100 నుంచి 200 వరకు ధర పలుకుతుంది. కేవలం ఒక సీజన్లో మాత్రమే లభించటం వల్ల చాలామంది వీటిని తినడానికి ఆసక్తి చూపిస్తారు.
Share your comments