ఇప్పటి వరకు మనకు సాధారణ టీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ గురించి తెలుసు. వీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి మనకు తెలిసిందే. అయితే ఈ విధంగా రకరకాల టీ ల గురించి మనం వినే ఉంటాం కానీ, మనం ఎప్పుడూ కూడా బ్లూ టీ గురించి విని ఉండము. బ్లూ టీ రంగును చాలామంది ఇష్టపడి డి ఈ టీ తాగుతూ ఉంటారు. అయితే ఈ టీ తాగటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇకపై ఈ టీని తాగకుండా ఎవరూ ఉండరు. మరి బ్లూ టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం...
సాధారణంగా ఈ బ్లూ టీని అపరాజిత పుష్పాలతో తయారు చేస్తారు. బ్లూ టీలో యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా మన శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగుపడటం కాకుండా మొహం పై ఏర్పడిన వలయాలను తొలగించి వయసు ఎక్కువగా కనిపించకుండా కాపాడుతుంది.కాలేయంలో పిత్తరస ఉత్పత్తికి బ్లూ టీ దోహదపడి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బ్లూ టీ తరచు తాగటం వల్ల వాంతులు, వికారం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
బ్లూ టీలో ఉంటే యాంటీ గ్లైసాటీన్ ప్రాపర్టీస్ వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఎలాంటి చర్మ వ్యాధులు దరిచేరవు. అదే విధంగా చర్మం పై ఏర్పడిన మచ్చలను తొలగించి చర్మం ఎంతో కాంతివంతంగా మెరవడానికి దోహదపడుతుంది. జుట్టు రాలే సమస్య ఉన్నవారికి బ్లూ టీ ఒక చక్కని పరిష్కార మార్గం అని చెప్పవచ్చు. ఈటీ లో అధిక మొత్తంలో ఆంథోసైనిన్ ఉండటం వల్ల తలకు రక్తప్రసరణను మెరుగుపరిచి జుట్టును ఎంతో ఆరోగ్యవంతంగా ఉండడానికి దోహదపడుతుంది.ఈటీవీ తరచు తాగడం వల్ల క్యాన్సర్ ప్రమాదం నుంచి బయటపడటమే కాకుండా మెదడు ఎంతో చురుగ్గా పనిచేస్తుంది. దీంతో ఆ రోజంతా ఎంతో ఉల్లాసంగా గడుపుతారు.
Share your comments