Health & Lifestyle

ఉడికించి తినవలసిన కూరగాయలు ఇవే.....

KJ Staff
KJ Staff

బరువు తగ్గించుకోవాలి మరియు ఆరోగ్యంగా ఉండాలని చాలామంది కూరగాయలను సలాడ్స్ లాగా తినడం మామూలైపోయింది. చాలా మంది క్యారెట్, బీట్రూట్ మరియు టమాటో వంటి కూరగాయలను పచ్చిగానే తినడానికి ఇష్టపడతారు అయితే ఇలా తినడం వలన కలిగే మన శరీరానికి అందవలసిన పోషకవిలువలు అందవని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. కొన్ని రకాల కూరగాయలను ఉడికించి తినడం వలన ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు, అంతేకాకుండా ఇలా తినడం వలన శరీరానికి అందవలసిన్స్ పోషకాలు కూడా అందుతాయని చెబుతున్నారు.

బచ్చలికూర:

బచ్చలికూరలో ఆక్సలిక్ ఆమ్లాలు అధికంగా ఉంటాయి, ఇవి కాల్షియమ్ మరియు ఐరన్ వంటి అవసరమైన పోషకాలు శరీర శోషణలో ఆటంకం కలిగిస్తాయి. బచ్చలికూరలో ఐరన్ మరియు కాల్షియమ్ ఎక్కువుగా ఉన్నా ఆక్సలిక్ ఆమ్లాలు వలన వీటి లబ్యతలో ఆటంకం కలుగుతుంది. అదే బచ్చలి కూరను తినేముందు ఉడికించి తింటే ఈ మినరల్స్ అన్ని శరీరానికి లభిస్తాయి. ఇవి ఎముకుల ఆరోగ్యాన్ని కాపాడి రక్తహీనతను తగ్గిస్తాయి.

క్యారెట్లు:

క్యారెట్లోని బీటా కెరోటిన్, విటమిన్-ఏ శరీరానికి అందిస్తుంది. అయితే క్యారెట్ కణాలు గోడలను విచ్చినం చెయ్యగలిగే శక్తి మన జీర్ణ వ్యవస్థకు లేదు, దీనివలన పోషకాలను పొందడం కష్టతరంగా మారుతుంది, క్యారెట్లను ఉడకబెట్టినట్లైతే కణాల గోడలు విచ్చిన్నమై ఈ పోషకాలు అన్ని లభిస్తాయి. క్యారెట్లు తినడం వలన కంటి ఆరోగ్యం మరియు చర్మఆరోగ్యం మెరుగుపడతాయి.

టమోటాలు:

టమోటాల్లో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కాపాడుతుంది. టమోటాను ఉడకబెట్టడం ద్వారా లైకోపీన్ లబ్యత మరింత పెరుగుతుంది. దీని వలన గుండెవ్యాధులను కూడా దూరంగా పెట్టవచ్చు.

బీట్రూట్:

రక్తహీనత ఉన్నవారిలో రక్తశాతాని పెంచడంలో బీట్రూట్ ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా బీట్రూట్ దుంపలు నైట్రేట్లను సంరక్షిస్తాయి. ఈ నైట్రేట్లు రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచి రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. బీటర్రోట్ లోని యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

బ్రోకలీ:

ప్రతిరోజు ఉడకబెట్టిన బ్రోకలీ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. బ్రొకోలీని ఉడకబెట్టినప్పుడు దానిలోని కొన్ని హానికారక పదర్ధాల గాడత తగ్గుతుంది. బ్రొకోలీలోని విటమిన్- కే, సి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, చర్మ ఆరోగ్యం మరియు ఎముకుల ఆరోగ్యం మెరుగుపరచడంలో కూడా సహాయం చేస్తాయి.

చిలకడదుంపలు:

సాధారణంగా చిలకడదుంపలను కూర కంటే ఉడికించిన వాటిని తినడానికే ఎక్కువ ఇష్టపడతారు. చిలకడదుంపలు ఉడకబెట్టి తినడం వలన బీటా కెరోటిన్ వంటి పోషకాలు అధికస్థాయిలో లభ్యమవుతాయి. దీని వలన శరీరానికి అవసరమైన విటమిన్-ఏ లభించి ద్రుష్టి లోపాలు తగ్గడం, రోగనిరోధక శక్తీ పెరగడం మరియు చర్మ ఆరోగ్యం మెరుగుపడటం వంటి ప్రయోజనాలు కలుగుతాయి.

బంగాలదుంపలు:

బంగాలదుంపలను ఉడికిస్తే వాటిలో గ్లైసీమిక్ సూచిక తగ్గుతుంది, దీని వలన విటమిన్-సి, బి 12 వంటి పోషకాలు సంవృద్ధిగా లభిస్తాయి. వీలైనంత వరకు దుంపలు ఉడకబెట్టి తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఉడికించిన ఆహారం తినడం ద్వారా అది తొందరగా జీర్ణమై శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది.

Share your comments

Subscribe Magazine