Health & Lifestyle

తెల్లబియ్యంతో వండిన అన్నం ఎక్కువుగా తింటున్నారా? అయితే ఇది చదవండి....

KJ Staff
KJ Staff

భాతదేశంలోని ప్రజలకు అన్నం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, మరీముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని ప్రజలకు మూడు పూట్లా అన్నమే ఆహారం. ఉదయం అల్పహారం నుండి రాత్రి భోజనం వరకు అన్నం లేకుండా గడవదు. పోలిష్ చేసిన తెల్లని అన్నం మొదలుపెట్టాక ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా మొదలయ్యాయి. పూర్వం దంపుడు బియ్యం తినే రోజుల్లో, ప్రజలు మూడుపూట్లా అన్నం తిన్నాసరే ఆరోగ్యంగా ఉండేవారు. అదే ఇప్పుడు షుగర్ మరియు బీపీ సమస్యలు ఎక్కువైపోయాయి.

దంపుడు బియ్యంతో పోలిస్తే పోలిష్ చేసిన అన్నం చూడటానికి ఆకర్షనియ్యంగా, వండినప్పడు మృదువుగా కనబడతాయి, కాబట్టి ప్రజలు వీటిని తినడానికి ఎక్కువుగా ఇష్టపడతారు. అయితే ఇటువంటి అన్నం ఎక్కువుగా తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. దంపుడు బియ్యంలో వరి పొట్టు కింద ఉండే తవుడు ఎన్నో పోషకాలకు మరియు విటమిన్లకు మూలం, అయితే ఇవి చూడటానికి ఆకర్షనియ్యంగా ఉండకపోవడంతో, తెల్లబియ్యం వినియోగించడం జరుగుతుంది. ఎక్కువుగా పోలిష్ చెయ్యడం వలన వీటిపైనే ఉండే పోషకాలతో కూడిన పోర కూడా తొలగిపోతుంది.

హార్వార్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వారు జరిపిన ఆద్యానంలో, ఎక్కువ మొత్తంలో తెల్లబియ్యం తినడం ద్వారా షుగర్ వ్యాధి వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందని తేలింది. వీటి స్థానంలో దంపుడు బియ్యం తినడం ద్వారా షుగర్ వచ్చే ముప్పు 16% తగ్గుతున్నట్లు కనుగొన్నారు. దీనితోపాటు రక్తపోటుకు కారణమయ్యే పొటాషియం దంపుడు బియ్యంలో తక్కువ ఉంటుంది కాబట్టి బీపీ కూడా తగ్గుముఖం పడుతుంది. అంతేకాకుండా ఎముకులకు బలాన్ని అందించే నియాసిన్ మరియు విటమిన్ బి3 లాంటి పోషకాలు దంపుడు బియ్యంలో పుష్కలంగా ఉంటాయి. బియ్యాన్ని పోలిష్ చెయ్యడం ద్వారా ఈ పోషకాలు అన్ని పోయి కేవలం కార్బోహైడ్రేట్లు మాత్రమే లభిస్తయి.

దంపుడు బియ్యం సెలీనియం కి ఒక మంచి వనరు. ఇది థైరాయిడ్ హార్మన్ల ఉత్పత్తికి మరియు క్యాన్సర్ కణాలను అడ్డుకోవడంలో ఎంతగానో సహాయం చేస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా దంపుడు బియ్యం ఎంతగానో తోడ్పడతాయి. దంపుడు బియ్యంలో పిండి పదార్ధం నెమ్మదిగా జీర్ణం కావడం వలన రక్తంలో చెక్కెర స్థాయిలు తొందరగా పెరగవు. వీటిని కొద్దీ మొత్తంలో తిన్నాసరే కడుపు నిండిన భావన కలిగి వెంటనే ఆకలి కూడా వెయ్యదు. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నందు కారణంగా తెల్లబియ్యని తగ్గించి దంపుడు బియ్యం తినడానికి ప్రయత్నించాలి.

Share your comments

Subscribe Magazine