మన చుట్టు ఉండే ఎన్నో మొక్కలో మనకు తెలియని ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి, కానీ వాటి ఉపయోగాలు తెలియక వాటిని పీకి పడేస్తూ ఉంటాం. అటువంటి ఎన్నో ఔషధ గుణాలున్న మొక్కలో తిప్పతీగ ఒకటి. ఈ తిప్పతీగ శరీరంలో పేరుకుపోయిన మలినాల్ని శుభ్రపరచి రక్తాన్ని శుద్దీకరించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా అనేక వ్యాధులను కూడా ఈ తిప్పతీగ నయం చెయ్యగలదు. ఈ ఆకులు జ్యూస్, క్యాప్సూల్స్ మరియు పౌడర్ రూపంలో మార్కెట్లో దొరుకుతుంది. ఈ ఉత్పత్తులను వాడటం మూలాన జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు మధుమేహం మరియు ఆర్థరైటిస్ వంటి రోగాలను సైతం నయం చేసుకోవచ్చు.
ఆర్థరైటిస్ నొప్పి నుండి ఉపశమనం:
వయసు పైబడగానే పెద్దవాళ్ళను వేదించే ప్రధాన సమస్యల్లో ఆర్థరైటిస్ ఒకటి. ఆర్థరైటిస్ ఉండి దాని నుండి ఉపశమనం పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి నిరాశ చెందినవారికి తిప్పతీగ ఆకు ఒక వరంవంటిది అని చెప్పుకోవచ్చు. రోజువారీ ఆహారంలో దీనిని చేర్చుకోవడం ద్వారా ఆర్థరైటిస్ వ్యాధిని దూరం చేసుకోవచ్చు. ఆర్థరైటిస్ తో బాధపడుతూ రాత్రి నిద్రపట్టనివారు తిప్పతీగ పొడిని రాత్రి వేళల్లో పాలల్లో కలుపుకొని తాగితే ప్రశాంతవంతమైన నిద్ర పడుతుంది.
మధుమేహం:
మధుమేహం ఉన్నవారి రక్తంలో చెక్కెర స్థాయిలు అసాధారణంగా పెరిగిపోవడం లేదా తగ్గిపోతూ ఉంటుంది. చెక్కెర స్థాయిని నియంత్రించే ఇన్సులిన్ అనే హార్మోన్ అసమతుల్యత వలన ఈ చెక్కెర స్థాయి ఈ విధంగా మారుతూ ఉంటుంది. తిప్పతీగ ఆకులు, కాండం, వేరు ఇలా ఏదైనా భాగాన్ని కషాయంలాగా చేసుకొని తాగితే రక్తంలో షుగర్ స్థాయి నియంత్రించబడుతుంది. అసాధారణ ఇన్సులిన్ స్థాయిని నియంత్రించడంలో కూడా తిప్పతీగ ఎంతగానో ఉపయోగపడుతుంది.
జీర్ణవ్యవస్థ మెరుగుపరుస్తుంది:
జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో తిప్పతీగకు సాటి లేనేలేదు. తిప్పతీగ రసం తాగడం వలన గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు దరిచేరవు. ప్రతిరోజు ఉదయానే ఒక కప్ తిప్పతీగ రసం తాగడం వలన రక్తం శుద్ధిచేయబడుతుంది, దీనితోపాటు జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
ఒత్తిడిని దూరం చేస్తుంది:
ఈ రోజుల్లో ఒత్తిడి అనేది అందరికి సర్వసాధారణం అయిపోయింది. తిప్పతీగలోని ఔషధ గుణాలు ఒత్తిడిని తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలిగించి మెదడును ప్రశాంతంగా చేస్తుంది.
Share your comments