Health & Lifestyle

రోగాలపై "దొండ" యాత్ర.....

KJ Staff
KJ Staff

మన తరచు వాడే కూరగాయల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వీటిలో మన శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు మరియు ఫైబర్ సమావృద్ధిగా లభ్సితాయి. కూరగాయలు ఇంత ఆరోగ్యకరమైనవి కాబట్టే అన్నం కంటే కూరగాయలు ఎక్కువ తినాలని సూచిస్తారు. ఒక్కో కూరగాయలో ఒకవిధమైన ప్రత్యేకత ఉంటుంది. శరీరానికి అవసరమైన పోషకాలు అందించే కూరగాయల్లో దొండకాయ ఒకటి, దొండకాయలోని పోషక విలువలు, రోగాలపై దండయాత్ర చేస్తాయి. దొండలోని విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దొండకాయలో అనేకమైన పోషకవిలువలు ఉంటాయి. దొండ ఫైబర్ కి ఒక మంచి వనరు. ఫైబర్ జీర్ణక్రియను పెంచడంలో తోడ్పడుతుంది, మరియు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మలబద్దకం ఉన్నవారికి ఫైబర్ చాలా అవసరం, ఫైబర్ ఎక్కువుగా ఉండే దొండకాయ తినడం ద్వారా మలబద్దకం దూరమయ్యే అవకాశం ఉంటుంది. దొండకాయ తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఎన్నో రకాల పోషకాలకు దొండకాయ నిలయం, దీనిలో విటమిన్- బి1, బి2, బి3, బి6, మరియు బి9 తో పాటు, విటమిన్-సి, కాల్షియమ్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఎముకులకు పుష్టి కలిగించే ఖనిజాలు, జింక్, సోడియం వంటి ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి.

దొండకాయలో ఎన్నో పోషకాల్లో యాంటీ అడిపోస్ ఏజెంట్ ఒకటి. ఇది రక్తంలో చెక్కెర స్థాయిని నియంత్రించడంలో మరియు ఎక్కువుగా ఉన్న చెక్కెర స్థాయిని తగ్గించడంలో తోడ్పడతాయి. రక్త హీనత ఉన్నవారికి దొండకాయ ఒక వరం వంటిది అని చెప్పవచ్చు. డొంకాయలోని పోషకవిలువలు కొత్త రక్తం ఉత్పత్తి జరిగేలా ప్రోత్సహిస్తాయి. దొండకాయను పచ్చిగా తినడం వలన కూడా ప్రయోజనం ఉంటుంది, ఇలా తినడం వలన రోగనిరోధక శక్తీ పెంచి రోగాల భారిన పడకుండా కాపాడుతుంది.

దొండకాయలో యాంటీ ఇంఫలమేటరీ, మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఎంతగానో సహాయం చేస్తాయి. కనీసం వారానికి ఒకసారైనా దొండకాయ తినాలి ఇలా తినడం మూలాన ఎన్నో రకాల వ్యాధుల నుండి రక్షణ లభ్సితుంది. ఆరోగ్యతో పాటు గుండె ఆరోగ్యాన్ని పెంపొందించే ఎన్నో రకాల పోషకాలు కూడా దొండకాయలో ఉంటాయి. దొండకాయ తినడం వలన పక్షవాతం వచ్చే అవకాశం తగ్గిపోతుంది, అదేవిధంగా కాన్సర్ వ్యాధిని కూడా రాకుండా కాపాడుతుంది. ఆస్తమా వంటి శ్వాస సంబంధిత వ్యాధులను నియంత్రించి, కంటి చూపును కూడా కాపాడేందుకు తోడ్పడుతుంది.

Share your comments

Subscribe Magazine