వేసవి ఉష్ణం నుండి తప్పించుకోవడానికి కార్భుజా ఎంతో మేలు చేస్తుంది, దీనిని జ్యూస్ మరియు సలాడ్లో కలుపుకొని తినడమే మనకు తెలుసు అయితే కార్భుజా గింజల్లో కూడా ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనలో చాలా కొద్దీ మందికే తెలుసు.
సాధారణంగా కార్భుజా తినగానే వాటిలోని గింజలను తీసి బయట పడేస్తాం, అయితే వాటికున్న పోషక విలువల గురించి తెలుసుకుంటే ఇంక పొరపాటునకూడా వాటిని పడెయ్యారు. కార్భుజా లోని గింజలను తీసి వాటిని కడిగి నీరు మొత్తం ఆరిపోయేవరకు ఫ్యాన్ కింద లేదంటే ఎండలోనూ ఆరబెట్టాలి. వీటిని స్వీట్ల మీద మరియు కొన్ని రకాల వంటకాల్లో వినియోగించవచ్చు. బయట మార్కెట్లో కూడా ఇవి సులభంగా లభిస్తాయి. వీటిలో ఉన్న ఆరోగ్య విలువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది:
కర్భుజా గింజల్లో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. వీటిని తరచూ తినడం ద్వారా రోగనిరోధక శక్తీ పెరిగి, ఇన్ఫెక్షన్లు దరిచేరవు. రోగనిరోధక వ్యవస్థ మెరుగుపరచగలిగే యాంటీఆక్సిడెంట్లు వీటిలో సంవృద్ధిగా లభిస్తాయి.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
కార్భుజా గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి, ఈ ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ శరీరం మరియు రక్తనాళాల్లోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి, రక్త ప్రశరణా మరియు గుండె ఆరోగ్యం మెరుగుపడేందుకు తోడ్పడతాయి. కార్భుజా గింజలు ఆక్సీకరణను కూడా తగ్గించే లక్షణాలను కలిగిఉంటాయి.
జీర్ణ క్రియను మెరుగుపరచడం:
కార్భుజా గింజల్లో డైట్రీ ఫైబర్ అధికం ఉంటుంది, ఇది పేగుల కదలికలను క్రమబద్దీకరించి అరహా కదలికలను సులభతరం చేస్తుంది.పేగులలోని మంచి బాక్టీరియా ను వృద్ధిపరచడమే కాకుండా, మలబద్దకాన్ని కూడా అరికడుతుంది.
ఎముకులకు బలం చేకూర్చడం:
కార్భుజా గింజల్లో ఉండే అధిక కాల్షియమ్, ఫోస్ఫోరోస్, మెగ్నీషియం, ఎముకలను దృఢంగా చెయ్యడంలో సహాయం చేస్తాయి. అంతేకాకుండా కీళ్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఎముకల సంబంధిత వ్యాధులు ఉన్నవారు కార్భుజా గింజలు తినడం ద్వారా ఈ వ్యాధులు నయమయ్యే అవకాశం ఉంటుంది.
Share your comments