వంటకాల్లో టొమాటకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. కేవలం ఒక్క భారత దేశంలోనే కాదు ప్రపంచ దేశాలన్నిటిలో కూడా టొమాటకు విశిష్టమైన ప్రత్యేకత ఉంది. టమాటా పోషకాలకు ఘనీ వంటిది, దీనిని అనేక రకాల వంటకాల్లో వినియోగిస్తారు. టొమాటను జ్యూస్లు, కూరలు, సూపులు, మరియు సలాడ్ల తయారీలో ఉపయోగిస్తారు. అంతేకాకుండా అన్ని రకాల ఫాస్ట్ ఫుడ్ తయారీ టమాటో సాస్ లేకుండా పూర్తికాదు. ఒక్కముక్కలో చెప్పాలంటే టమాటా వంటకాలకు ఒక సెపెరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇంతటి ప్రత్యేకత ఉన్న టమాటాలో ఉండే పోషకవిలువలు గురించి నిపుణులు ఏమంటున్నారు ఇప్పుడు తెలుసుకుందాం.
ఏదైనా ఆహార పదార్ధాన్ని ఆరోగ్యకరమైనదిగా పరిగణించాలంటే దానిలో ఉండే పోషకవిలువలను బట్టి ఎంత ఆరోగ్యకరమైనదో నిర్ణయిస్తారు. టొమాటోలో కూడా ఎన్నో విటమిన్లు అందుబాటులో ఉన్నాయి, విటమిన్- ఏ, సి, కే, బి1-బి7 విటమిన్లు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ పోస్ఫోరోస్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రకారం ఒక 100 గ్రాముల టొమాటలో అందులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయని పేర్కొన్నారు. దీనిప్రకారం 100 గ్రాముల టొమాటలో శక్తీ 19 కిలో కెలోరీలు, కార్భోహైడ్రాట్లు, 2.7 గ్రాములు, మొత్తం కొవ్వు, 0.5 గ్రాములు, బీటా కెరోటిన్ 905 mcg, మరియు విటమిన్-ఏ 151 mcg ఉంటాయి. కోవు పదార్ధాలు తక్కువుగా ఉండటం చేత వీటిని తినడం ద్వారా గుండెకు ఏ విధమైన హాని ఉండదు.
టమాటో తినడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, అంతేకాకుండా శరీరంలో ఉండే కాన్సర్ కారకాలను కూడా తొలగిస్తుంది. టొమాటలో ఉండే లైకోపీన్, గుండెజబ్బుల నుండి మనల్ని దూరంగా ఉంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించడంలోనూ టమాటో దోహదపడుతుంది.
తక్కువ కెలోరీలు మరియు అధిక ఫైబర్ కోసం చూసేవారికి టమాటో ఒక చక్కటి పరిష్కారం. షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారుకూడా తినవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు కూడా టొమాటను తమ ఆహారంలో చేర్చుకోవచ్చు. దీనిలో ఉండే విటమిన్ సి, ఏ మరియు పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ విధంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న టొమాటను మన ఆహారంలో చేర్చుకోవడం తప్పనిసరి అని న్యూట్రిషన్ లు చెబుతున్నారు.
Share your comments