మే 1 న కార్మిక దినోత్సవం లేదా మే డేగా జరుపుకుంటారన్న విష్యం అందరికి తెలిసిందే, అయితే మే 2 రెండో తారీఖున కూడా విశేషమైన రోజుగా పరిగణిస్తారు. మే 2 వ తారీఖును ప్రపంచ టూనా డే గా జరుపుకుంటారు. టూనా చేపలు తిందాం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
టూనా చేపలు కేవలం ఆకారంలోనే కాకుండా పోషకవిలువలలో కూడా చాలా పెద్దవి. ఈ చేపలతో ఎన్నో రకాల వంటకాలు చేసుకోవచ్చు. పెద్ద పెద్ద రెస్టారెంట్లలో టూనా చేపలతో చేసిన వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వీటి రుచి అమోగంగా ఉండటంతో మార్కెట్లో మంచి ధరకు అమ్ముడుపోతాయి. అయితే కొన్ని సంవత్సరాల నుండి టూనా చేపల సంఖ్య తగ్గిపోతుంది. అధిక మొత్తంలో వీటిని పట్టుకోవడం, వీటి పునరుత్పత్తికి సమయం ఇవ్వకపోవడం వీటి సంఖ్యా తగ్గిపోవడానికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. వీటిని ప్రాముఖ్యతను గుర్తించి వీటిని సంరక్షించడానికి ఐక్యరాజ్య జనరల్ అసెంబ్లీ ప్రతి ఏటా ప్రపంచ టూనా దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. టూనా చేపలను తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఎన్నో రోగులను అడ్డుకునే శక్తీ ఈ టూనా చేపలకు ఉంది.
టూనా చేపలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటి లభ్యత సరిగ్గా లేనివారు కనీసం వారానికి ఒకసారైనా వీటిని తమ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మేలైన ఫఫలితాలను పొందవచ్చు. బరువు తగ్గాలనుకునేవారికి టూనా చేపలు తినడం ఒక సులువైన విధానం. చేపల్లో ఒమేగా త్రి ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉంటాయి. టూనా చేపల్లో ఈ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడంలో తోడ్పడి, గుండెకు రక్త ప్రశరణా సజావుగా జరిగేలా సహాయం చేస్తాయి.
టూనా చేపల్లో పొటిషియం ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి, ఇవి అధిక రక్తపోటును నియంత్రించి బీపీ ని కాంట్రలో లో ఉంచుతాయి. ఈ చేపల్లో లభించే విటమిన్ బి,డి ఎముకలు గట్టిపడటానికి బలంగా తయారవుతాయి. కొన్ని అధ్యనాల ప్రకారం టూనా చేపల్లో ఉండే ఎలాస్టిన్ చర్మానికి మృదుత్వాన్ని, సహజసిద్దమైన కాంతిని ఇస్తుందని తేలింది. ఇలా టూనా చేపలల్లో మనకు తెలియని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి.
Share your comments