అల్లం.. దీనిని ఆయుర్వేద ఔషధంగా పరిగణిస్తారు. వనమూలికగా భావిస్తారు. వంటకాల్లో అల్లంకు అత్యంత ప్రాధాన్యత ఉంది. అల్లం వేయకపోతే కూర రుచిగా అనిపించదు. వంటకు అదనపు రుచిని తెస్తుంది. చాలా వంటకాల్లో అల్లంను ఉపయోగిస్తారు. ఇక అల్లం టీ తాగితే జలుబు, తలనొప్పి వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. కొంచెం ఘాటుగా, చేదుగా అనిపించే అల్లంలో ఎన్నో ఔషధ గుణాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వంటల్లో లేదా, టీ, గోరు వెచ్చని నీటిలో అల్లం కలిపి తాడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరానికి అల్లం ఎంతో మేలు చేస్తుంది. అల్లంలో యాంటీ ఇంప్లమేటరీ గుణాలు ఉంటాయి. దీని వల్ల శరీరంలోని మంటను నివారిస్తుంది. ఇక ఉదయం లేవగానే తరచుగా వికారంగా అనిపిస్తుంటే.. అల్లం తీసుకోండి. దీంతో వికారం తగ్గుతుంది. నేరుగా అల్లం తినలేని వాళ్లు బెళ్లం, లేదా చక్కరతో చేసిన అల్లమురబ్బ తినవచ్చు. ఇక గర్భిణీ స్త్రీలు, కీమోథెరపీ చేయించుకునేవారు అల్లం తినడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి.
ఇక రోజూ అల్లం తీసుకోవడం వల్ల కండరాల నొప్పి తగ్గుతుంది. కండరాల నొప్పితో బాధపడేవారు నెల రోజుల పాటు క్రమంగా తప్పకుండా అల్లం తీసుకుంటే సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చు. అలాగే మలబద్దకానికి చెక్ పెట్టడానికి అల్లం బాగా ఉపయోగపడుతుంది. అల్లంలో ఉండే పీచు పదార్థం మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. ఇక అల్లం తినడం ద్వారా పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి తగ్గుతుంది. ఇక కడుపునొప్పి కూడా తగ్గిస్తుంది.
ఇక శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను అల్లం తరిమికొడుతుంది. రోజూ అల్లం తీసుకోవడం ద్వారా రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడంలోనూ అల్లం ఉపయోగపడుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అల్లంలో ఉండే యాంటీ ఇంప్లమేటరీ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇక జలుబు, తలనొప్పి, కడుపునొప్పి వంటి సమస్యలకు అల్లంతో చెక్ పెట్టవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
ఇక గొంతునొప్పికి అల్లం బాగా ఉపయోగపడుతుంది. గొంతునోప్పితో బాధపడేవారు అల్లం తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇక ఉదయం లేచిన వెంటనే పడి కడుపున అల్లం రసం తాగితే బాడీలో యాంటీబాడీస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. బీపీ, షూగర్ తో బాధపడేవారు అల్లం రసం తీసుకుంటే చాలా మంచిది. ఇది ఒక వజ్రాయుధంగా పనిచేస్తుంది. రోజూ అల్లం రసం తీసుకుంటే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయట. అయితే అల్లంపై ఉన్న పొట్టు తీసి వాడాలని నిపుణులు చెబుతున్నారు.
Share your comments