తేనెను ఇష్టపడనివారంటు ఉండరు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు తేనే అంటే ఇష్టం లేని వారు ఉండరు. తేనే అమోఘమైన రుచి కలిగి ఉండటంతో పాటు ఎన్నో పోషకాలకు నిలయం. తేనెకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉండటం మూలాన ప్రస్తుతం కల్తీ తేనే విస్తృతంగా విక్రయించబడుతుంది. ఇటువంటి తేనెలో చెక్కర స్థాయి అధికంగా ఉంటుంది, కనుక తేనెను వినియోగించేముందు అది సరైనదా కాదా అన్న విషయాన్ని ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవడం మంచిది.
తేనెకు అనేక ఔషధగుణాలున్నాయి. తేనెను వేడి నీటిలో కలుపుకొని తాగడంచేత ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దీని మీద కొన్ని అధ్యయనాలు జరపగా, వేడి నీటిలో తేనెను కలుపుకొని తాగడం మూలాన బరువు తగ్గుతురని తేలింది అంతే కాకుండా తేనెలో ఉండే కొన్ని ప్రత్యేక లక్షణాల మూలంగా జీర్ణ క్రియకుడా మెరుగుపడుతుంది. ఉదయానే వేడి నీటిలో తేనే కలుపుకుని తాగితే ఒంట్లోని చెడు కొవ్వు మొత్తం బయటకుపోతుంది.
తేనెలో యాంటీబాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి మిమ్మల్ని అనారోగ్య సమస్యలు దూరం కావడంతో పాటు, ఆరోగ్యం కూడా కుదిటపడుతుంది. దీనిలో యాంటీఇంఫ్లమాటరీ లక్షణాలు ఉండటం చేత శరీరంలో వచ్చే వాపును నివారిస్తుంది. తేనే సహజ చెక్కెర్లకు మూలం, దీనిలో ఉండే ఫ్రూక్టోజ్ అనే చెక్కెర రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగనియ్యకుండా నివారిస్తుంది కనుక షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా ఎటువంటి భయం లేకుండా తినొచ్చు. కాకపోతే అధికంగా తింటే ప్రమాదం అని గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం షుగర్ పేషెంట్ల కోసం తేనెతో తయారుచేసిన స్వీట్లు విక్రయిస్తున్నారు.
శ్వాసకోశ సమస్య ఉన్నవారికి తేనే ఒక ఔషదంలాగా పనిచేస్తుంది. దీనికోసం ఒక గ్లాస్ వేడి నీటిలో రెండు స్పూన్ల తేనే కలుపుకొని తాగితే గొంతు నొప్పి, జలుబు, మరియు దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు దూరమవుతాయి. అంతే కాకుండా తేనెలో సహజంగా శక్తిని అందించే గుణం ఉంది. సహజసిద్దమైన చెక్కెరకు తేనే మూలం. అంతేకాకుండా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారికీ తేనే ఒకవరం. తేనెలో ఉండే కొన్ని సమ్మేళనాలు మెదడుకు ఒత్తిడి తగ్గించి, ప్రశాంతంగా నిద్రపోయేందుకు తోడ్పడుతుంది.
కొన్ని అధ్యయనాల ప్రకారం వేడి నీటిలో తేనెను కలుపుకొని తాగడం వలన జీర్ణ క్రియ మెరుగుపడుతుందని తేలింది. అయితే ఇలా చేస్తే బరువుగా తగ్గుతుందన్న శాస్త్రీయ ఆధారాలు చాల తక్కువ, కనుక తేనెను ఇలా వేడి నీటిలో కలుపుకొని తాగడంతో పాటు క్రమశిక్షణతో కూడిన వ్యాయామం కూడా అవసరం అప్పుడే మెరుగైన ఫలితాలు పొందవచ్చు.
Share your comments