ఈ సృష్టిలో ప్రకృతి సిద్ధంగా మన పరిసరాల్లోనే మనకు అవసరమైన అన్ని ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న మొక్కలను సృష్టించి మనకు గొప్ప వరంగా ఇచ్చిందని చెప్పవచ్చు. అలాంటి ఔషధ గుణాలు పుష్కలంగా ఉండి పల్లె ప్రజలకు సుపరిచితమైన మొక్క విరిగి చెట్టు వీటికి కాసే కాయలనే విరిగి కాయలు అంటారు.విరిగి కాయ లోపల బంక లాగా ఒక తీపి పదార్థం ఉంటుంది. అందుకే కొన్ని ప్రాంతాలలో దీనిని బంక కాయల చెట్టు, బంకీర్ చెట్టు,నెక్కరకాయ చెట్టు అని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకం పేరుతో పిలుస్తూ ఉంటారు.
సాధారణంగా జూలై ,ఆగస్టు సీజన్లో మాత్రమే దొరికే బంకీర్ పండ్లను తినటం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిది.ఈ కాయల్లో మన శరీరానికి అవసరమైన ఔషధగుణాలతో పాటు కార్బోహైడ్రేట్స్, ఫైబర్ క్యాల్షియం,ఐరన్, పాస్పరస్ వంటివి సమృద్ధిగా లభిస్తాయి. సహజంగా దొరికే ఈ పండ్లను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను చూద్దాం.
బంకీర్ పండ్లను తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రించబడి ప్రమాదకర డయాబెటిస్ వ్యాధి నుండి రక్షణ పొందవచ్చు. ఈ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు మలబద్ధకం ,అజీర్తి వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. మహిళలు ఈ చెట్టు బెరడును కషాయంగా చేసుకుని తాగటం వల్ల నెలసరిలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఈ చెట్టు బెరడును ఎండబెట్టి పొడిచేసి ఆ పొడిని చర్మంపై పట్టిస్తూ ఉంటే ఫలితం స్పష్టంగా కనబడుతుంది. సంతానలేమితో బాధపడే వారు వీర్యకణాలు తక్కువగా వున్నవారు ఈ పండ్లు తింటే పురుషులు వీర్యకణాల వృద్ధి జరుగుతుంది. ఇలా చాలా రకాల వ్యాధులకు చక్కటి పరిష్కార మార్గంగా ఉన్న తియ్యటి పండ్లను బాగా పక్వానికి వచ్చిన తర్వాతే తినాలి. అలాగే ఈ పండ్లలో జిగురు లాంటి పదార్థం జీర్ణం కావడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి వీలైనంత తక్కువ పండ్లను తినడం మంచిది.
Share your comments