మనం రోజూ తినే పదార్థాలు, పండ్లు, కూరగాయలు, చిరు ధాన్యాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కానీ ఇవి చాలామందికి తెలియవు. ఎందుకంటే వీటి గురించి చాలామంది పట్టించుకోరు. తిన్నామా... కండుపు నిండిదా... అనేది మాత్రమే చూస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. ఆరోగ్యాన్ని అందించే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. శరీరానికి మంచి చేసే ఆరోగ్యకర ప్రయోజనాలను అందించే ఆహారం తీసుకోవాలి. ఏవి పడితే అవి తినకుండా మంచి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది.
అందులో భాగంగా చిరు ధాన్యాలైన రాగులను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. ఒకప్పుడు రైస్ తినాలంటే చాలా ఖర్చు అయ్యేది. అందుకే రాగులు, జోన్నలు వండుకుని తినేవారు. ఎప్పుడో ఇంటికి బంధువులు వస్తే రైస్ వండేవారు. అందుకే రాగులు తినడం వల్ల పాతకాలం మనుషులు ఎంతో బలంగా, ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు రాగులతో ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.
రాగులతో ఆరోగ్య ప్రయోజనాలు
-వేసవిలో రాగి జావ తాగితే డీహైడ్రేషన్ సమస్య ఉండదు
-రాగులతో చేసిన ఆహారం తింటే బరువు తగ్గుతాము
-రాగులతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల ఆకలిని తగ్గిస్తుంది
-ఎముకలు బలంగా తయారవుతాయి
- వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు
-చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉంటుంది
-రక్తహీనత సమస్యను పరిష్కరిస్తుంది
-షూగర్ వ్యాధిగ్రస్తులు రాగి జావ, గంజి తాగితే షూగర్ లెవర్స్ తగ్గుతాయి
-జీర్ణక్రియ మెరుగుపడుతుంది
-స్థూలకాయాన్ని తగ్గిస్తుంది
-పిల్లల త్వరగా ఎదగడానికి ఉపయోగపడుతుంది
-హై బీపీని తగ్గిస్తుంది
Share your comments