సాధారణంగా మనం సీతాఫలం గురించి వినే ఉంటాం. కానీ రామ ఫలం గురించి వినడం చాలా అరుదు. సాధారణంగా సీతాఫలం తినడానికి మనకి ఎంతో తీయనైన రుచిని కలిగి ఉంటుంది. అందుకోసమే మధుమేహంతో బాధపడే వారు సీతాఫలానికి దూరంగా ఉండాలని చెబుతారు. అయితే సీతాఫలంతో పోలిస్తే రామాఫలంలో అంత తీయదనం ఉండదు కనుక మధుమేహంతో బాధపడే వారు నిరభ్యంతరంగా రామఫలం తినవచ్చు. రామాఫలం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
రామఫలం ఎన్నో పోషకాల నిలయం అని చెప్పవచ్చు. ఇందులో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్, డైటరీ ఫైబర్, కొవ్వు, ప్రోటీన్, విటమిన్ బి1, బి2, బి5, బి3, బి6, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, పొటాషియం, సోడియం వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇందులో ఉన్నటువంటి ఈ పోషకాలు మన శరీరంలో చక్కెర స్థాయిలను నిలకడగా ఉంచడానికి దోహదపడతాయి.
ఈ ఫలంలో ఉన్నటువంటి విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి మన శరీరంలో ఉన్నటువంటి ఫ్రీరాడికల్స్ ను తొలగించే చర్మం ఎంతో కాంతివంతంగా మెరవడానికి దోహదపడుతుంది. విరేచనాలు, నిమోనియా, టైఫాయిడ్ వంటి వ్యాధులతో బాధపడే వారికి రామఫలం ఒక చక్కటి పరిష్కారం అని చెప్పవచ్చు. ఇందులో లభించే పట్టు వంటి సహజసిద్ధ యాంటీబ్యాక్టీరియల్, యాంటీబయాటిక్స్ ఈ సమస్యలను తగ్గించడానికి దోహదపడతాయి.
రామఫలంలో ఎక్కువ భాగం కాల్షియం, ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియ సమస్యలను మెరుగుపరుస్తాయి. అదేవిధంగా మలబద్దక సమస్యని కూడా నివారిస్తాయి. ఇందులో ఉన్నటువంటి క్యాల్షియం మన శరీరంలో ఎముకలు దృఢంగా తయారవడానికి దోహదం చేస్తాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నటువంటి ఈ రామ ఫలం దొరికినప్పుడు ఏలాంటి సందేహాలు వ్యక్తపరచకుండా తినడం ఎంతో మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.
Share your comments