Health & Lifestyle

ఎండాకాలంలో సబ్జాతో ఉపశమనం

KJ Staff
KJ Staff

అసలే ఎండాకాలం.. ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ తీవ్రతకు తోడు ఉక్కబోతతో ప్రజలు నానాపాట్లు పడుతున్నారు. దాదాపు 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదవుతుంది. దీంతో ప్రజలు ఉపశమనం కోసం శీతలపానియాల వైపు మొగ్గు చూపుతున్నారు. కోబ్బరినీళ్లు, జ్యూస్‌లు, డ్రింక్‌లు, నిమ్మకాయసోడా లాంటికి తీసుకుంటున్నారు. అయితే ఇంట్లో దొరికే చిన్న చిన్న పదార్థాలతో శరీరానికి చల్లదనాన్ని అందించే వాటిని మనం తయారుచేసుకోవచ్చు.

ఎండాకాలం చల్లదనం కోసం సబ్జలు చాలా ఉపయోగపడతాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

-సబ్జా తీసుకోవడం వల్ల ఒంట్లో చాలా కూల్‌గా ఉంటుంది. సబ్జా తీసుకోవడం వల్ల ఎంతవేడినైనా బాడీ తట్టుకోగలుగుతుంది. అందుకే సబ్జాని సమ్మర్ ఫుండ్ అంటారు. ఎసిడిటి, బ్లోటింగ్, తలనొప్పిని తరిమికొట్టడంతో ఇది ఉపయోగపడుతుంది.

-సబ్జా గింజల్లో ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలోని కొవ్వు కరిగించడానికి, బరువు తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే సబ్జల్లో ఉండే ఫైబర్ వల్ల కొవ్వు సులువుగా కరిగిపోతుంది.

-సబ్జా రోజూ తీసుకోవడం వల్ల రక్తం కూడా శుద్ధి అవుతుంది. ఇక జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి. వాంతి వచ్చేలాగా ఉంటే సబ్జా నీళ్లు తీసుకుంటే ఊరట కలుగుతుంది.

-ఇక రోజూ గ్లాసు నీళ్లల్లో సబ్జా గింజలను వేసి పిల్లలతో తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇక డయాబెటిస్‌తో బాధపడేవారు, శ్వాసకోస సమస్యలతో బాధపడేవారు సబ్జా తీసుకుంటే మంచి లాభం చేకూరుతుంది.

-ఇక గొంతుమంట, దగ్గు, ఆస్తమా, జ్వరంగా ఉన్నప్పుడు సబ్జా తీసుకుంటే మంచి ఫలితముంటుంది.

సబ్జాని డైట్‌లో ఎలా తీసుకోవాలి?

-సబ్జాని గంటసేపు నానబెట్టి ఆ తర్వాత తాగాలి. ఇక పెరుగు లేదా మజ్జిగలో నానబెట్టి అయినా తీసుకోవచ్చు. ఇక మిల్స్ షఏక్ ఫలుదా వంటి వాటిలలో కూడా వేసి తీసుకోవచ్చు.

-ఇక ఒక గ్లాసు నీటిలో కొంచెం సాల్ట్, పంచదార వేసి సబ్జా తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది

 

Share your comments

Subscribe Magazine