ఎన్నో ఔషధ గుణాలు కలిగిన తులసి మొక్కకు మన భారతీయ సాంప్రదాయంలోనూ,మరియు భారతీయ ఆయుర్వేద వైద్యంలో ఎన్నో రకాల మొండి వ్యాధులకు చక్కటి పరిష్కారం మార్గాలను చూపబడింది. ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన తులసి టీ ప్రతి రోజూ తాగడం వల్ల తులసి మొక్కలో ఉన్నటువంటి యాంటీబ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి సీజనల్ గా వచ్చే వ్యాధులతో పాటు అనేక రకాల వ్యాధులను ఎదుర్కోవడానికి మనకు సహాయపడే ఉంది.
తులసి ఆకులను లేదా తులసి టీ ప్రతి రోజూ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూ బాధపడుతున్నప్పుడు రెండు తులసి ఆకులను లేదా తులసి టీ తాగడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది. తులసి టీ లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఆందోళనను తగ్గించేందుకు సహాయపడి, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ప్రతిరోజు తులసి టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగు జీర్ణ సంబంధిత వ్యాధులు తొలగుతాయి.
తులసి మొక్కలో చెడు కొలెస్ట్రాల్ ని, అధిక కేలరీలని త్వరగా కరిగించే గుణం ఉంది.కావున ప్రతిరోజు క్రమం తప్పకుండా తులసి టీ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కరిగి గుండె సమస్యలను పరిష్కరిస్తుంది.అలాగే మన శరీరంలో వేగంగా అధిక కేలరీలు కరిగిపోవడం వల్ల అతి బరువు సమస్య, ఊబకాయం వంటి వాటికి దూరంగా ఉండవచ్చు.ఇంత మంచి ఫలితాలనిచ్చే తులసి టీ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం! ఒక గ్లాసు మంచి నీరు తీసుకుని అందులో తులసి ఆకులు, గింజలు వేసి 2 గంటలు నానబెట్టాలి.తర్వాత నీటిని వడకట్టుకుని అందులో కొన్ని చల్లటి నీరు పోసి బాగా కలిపి అందులో కొన్ని పుదీనా ఆకులు, నిమ్మరసం వేస్తే రుచికరమైన, ఔషధ గుణాలు కలిగిన తులసి టీ సిద్ధమైనట్లే.
Share your comments