సాధారణంగా మనకి తేనె ఏ రంగులో ఉంటుంది అంటే చాలామంది ముదురు గోధుమ రంగులో ఉంటుంది అని చెబుతాము. కానీ తెలుపు రంగులో కూడా తేనె ఉంటుందని చాలామందికి తెలియదు. చాలామంది తెలుపు రంగులో ఉన్న తేనెను చూసినప్పటికీ అది సహజ సిద్ధంగా లభించే తేనె కాదని ఆ తేనే తినడానికి ఇష్టపడరు. అయితే తెల్ల తేనెలో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయనీ, అవి ఎన్నో రకాల అంటు వ్యాధులను మన నుంచి దూరం చేస్తాయని చెప్పవచ్చు.మరి తెల్ల తేనెలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..
ఈ తెల్ల తేనెను ముడితేనె అని కూడా అంటారు. ఈ తేనెను సహజసిద్ధంగా తేనెటీగల నుంచి తయారు చేస్తారు. ఈ తేనెలో ఎన్నో యాంటీబయాటిక్స్ ఉండటం వల్ల దీనిని హౌస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అని కూడా పిలుస్తారు. ఇందులో కేవలం యాంటీబయోటిక్స్ మాత్రమే కాకుండా ఐరన్, జింక్ ,మెగ్నిషియం, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ తేనెను తరచూ తీసుకోవడం వల్ల దగ్గు జలుబు వంటి ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం పొందడమే కాకుండా క్యాన్సర్, గుండె జబ్బుల నుంచి కూడా విముక్తి పొందవచ్చు అని చెప్పవచ్చు.
అధికంగా దగ్గు సమస్యతో బాధపడేవారు ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, తెల్ల తేనె కలిపి తాగటం వల్ల తొందరగా దగ్గు నుంచి విముక్తి పొందవచ్చు. అదేవిధంగా గ్లాస్ గోరువెచ్చని నీటిలోకి తెల్ల తేనెను మాత్రమే కలిపి తాగటం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వంటి వాటి నుంచి విముక్తి పొందవచ్చు. ఈ తేనెలో ఉన్నటువంటి యాంటీఆక్సిడెంట్లు మన శరీరంలో క్యాన్సర్ కణాలతో పోరాడటానికి దోహదపడతాయి. తద్వారా క్యాన్సర్ నుంచి విముక్తి పొందవచ్చు. ఇక చాలామంది నోటిలో ఇన్ఫెక్షన్, నోటి పూత వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఈ విధమైనటువంటి నోటిపూత సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఉదయం పరగడుపున ఒక టేబుల్ స్పూన్ తెల్ల తేనె తినటం వల్ల ఈ విధమైనటువంటి సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు.కనుక తెల్ల తేనేపై ఎలాంటి అపోహలు లేకుండా వీటిని నిరభ్యంతరంగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Share your comments