Health & Lifestyle

వాల్నట్ నూనెతో గుండె సమస్యలను దూరం చేయవచ్చా..?

KJ Staff
KJ Staff

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నా వాల్ నట్స్ తినడానికి కొద్దిగా చేదు రుచి అయినప్పటికీ మన ఆరోగ్యవంతమైన జీవితానికి సరిపడా పోషక విలువలు మెండుగా ఉన్నాయి. వాల్ నట్స్ ను ప్రతిరోజు మన డైట్ లో భాగం చేసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన ప్రోటీన్,కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, భాస్వరం, రాగి, సెలీనియం, ఒమేగా -3 ఫ్యాటీ ఆసిడ్స్ వంటి అనేక పోషకాలు సమృద్ధిగా లభించడంతోపాటు డిప్రెషన్, అల్జీమర్స్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి.

అయితే వాల్ నట్స్ లో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ వాల్నట్ ఆయిల్ లో కూడా ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వాల్నట్ నూనెలో ఆరు రకాల బ్యాక్టీరియాను చంపడానికి ఉపయోగపడే యాంటీ మైక్రోబయల్ గుణాలు కలిగి ఉన్నాయి. అలాగే నూనెలో మంచి పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్ల పుష్కలంగా కలిగి ఉన్నాయి. వాల్నట్ ఆయిల్ ను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గిస్తుంది.

వాల్నట్ నూనె లో ఉన్న పాలీ అన్‌ శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లాలు రక్తంలో షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తాయి. కొంచెం వాల్నట్ నూనెను తీసుకుని ముఖంపై వేళ్ల సహాయంతో మసాజ్ చేసుకోవడం వల్ల చర్మంపై మలినాలు తొలగించి కాంతి వంతమైన చర్మం మీ సొంతమవుతుంది. అయితే వాల్నట్ నూనె వంట చేసేటప్పుడు వాడితే కూరకి చేదు రుచి వస్తుంది. కాబట్టి దీనిని నేరుగా వంటల్లో కాకుండా సలాడ్లలో ఆహారంలో తీసుకోవచ్చు. ముఖ్య విషయం ఏమిటంటే కొందరిలో వాల్నట్ ఆయిల్ వాడడం వల్ల కొన్ని రకాల ఎలర్జీలు వస్తుంటాయి. అలాంటివారు ఈ నూనెను వాడకపోవడమే మంచిది.

Share your comments

Subscribe Magazine