Health & Lifestyle

మునగాకుతో 300 వ్యాధులకు చెక్

KJ Staff
KJ Staff
Moringa Leaves
Moringa Leaves

మనం రోజూ తినే ఆహార పదార్థాలు, కూరగాయలతో ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. తాజా కూరగాయాలు తినడం ద్వారా ఇమ్యూనిటీ పెరగడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఫాస్ట్, జంక్ ఫుడ్‌కి యువత అలవాటు పడి కూరగాయలు, ఆకుకూరలను తినడం మానేశారు. బయట ఫాస్ట్, జంక్ ఫుడ్ తిని తమ ఆరోగ్యాన్ని పాడు చేసుుంటున్నారు. పోషకాలు, విటమిన్లు అందించే కూరగాయలు, ఆకుకూరలను చాలామంది తినడం లేదు. ఆధునీకత యుగంలో బిజీ లైఫ్‌లో ఫాస్ట్ పుడ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

అయితే వెజిటేరియన్స్ మునక్కాయలు బాగా తింటూ ఉంటారు. చాలామంది ఇష్టంగా వీటిని తింటూ ఉంటారు. మునక్కాయల్లో ఎ, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఆరోగ్యం అందించే ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే మునక్కాయలే కాదు మునగాకు తినడం ద్వారా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. 300 వ్యాధులకు చెక్ పెట్టే విటమిన్లు, పోషకాలు ఉన్నాయట. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మునగాకులో ఎ,సి విటమిన్లు పుష్కలంగా ఉండటంతో పాటు కాల్షియం, పాస్పరస్, ఐరన్ ఉంటాయి. అందుకే మునగాకును ఆయుర్వేద మందుల్లో కూడా ఉపయోగిస్తారు. 300 వ్యాధులకు చెక్ పెట్టే శక్తి మునగాకుకు ఉందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. క్యారెట్లు తినడం ద్వారా వచ్చే విటమిన్లు మునగాకు తినడవం వల్ల అధికంగా వస్తాయట. కళ్ల వ్యాధులకు సంబంధించిన మెడిసిన్ లో మునగాకు వాడతారట.

మహిళలు రోజుకి 7 గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు రెగ్యులర్‌గా తీసుకుంటే 13.5 శాతం బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయట. థైరాయిడ్, ఎముకలను బలంగా చేయడంలో మునగాకు ఉపయోగపడుతుందట. అలాగే మునగాకు రసాన్ని నిమ్మరసంతో కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు, బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయట. ఒక స్పూన్ మునగ పువ్వుల రసమును ఒక గ్లాసు మజ్జిగలో కలిపి తాగితే ఉబ్బసానికి, అజీర్తి దూరమవుతుందట.బాగా మరిగించి చల్లార్చిన మునగాకు రసం ఒక చెంచా మోతాదులో తీసుకుని ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ నందు కలుపుకుని తాగిన మూత్రవిసర్జనలో మంట, కొన్ని మూత్ర పిండాల వ్యాధులు, మలబద్దకం తగ్గుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

ఒకస్పూను మునగాకు రసములో 3 మిరియాలు పొడి చేసి కలిపి కణతలు పైన రాసుకున్న తలనొప్పి తగ్గుతుంది. మునగాకు రసము నందు నువ్వులనూనె కలిపి నీరంతా ఆవిరి అయ్యేంత వరకు మరగకాచి ఆ మిశ్రమాన్ని గజ్జి, దురద వంటి చర్మవ్యాధులకు పైపూత ముందుగా రాయుచున్న చర్మవ్యాధులు తగ్గుతాయని తేలింది. ఒక చెంచా మునగాకు రసములో కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజూ పడుకునే ముందు తాగుచున్న రేచీకటి తగ్గుతుందట. అలాగే ఙ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని ఆయుర్వేద డాక్టర్లు చెబుతున్నారు.

 

Share your comments

Subscribe Magazine