Health & Lifestyle

ప్రోటీన్ ఎక్కువగా ఉండే స్నాక్స్ ఏమిటో తెలుసా?

KJ Staff
KJ Staff

శరిరంలో కండరాల నిర్మాణానికి మరియు అనేక ఇతర అవసరాలకు ప్రోటీన్ల అవసరం చాలా ఎక్కువుగా ఉంటుంది. ఈ ప్రోటీన్లు మనం తీసుకునే ఆహారం ద్వారా లభిస్తాయి. మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం ద్వారా ప్రతిరోజు ప్రోటీన్ తీసుకోవడం తప్పనిసరి. అయితే ఈ ప్రోటీన్ ఎక్కువుగా మాంసాహారం మరియు గుడ్లలోనే ఉంటుందని చాలా మంది నమ్ముతారు. అయితే మొక్కల ఆధారిత ఆహార పదర్ధాల్లో కూడా ప్రోటీన్ ఎక్కువుగానే ఉంటుంది. మన ప్రధాన ఆహారంతో పాటు, కాలక్షేపానికి తినే చిరుతిళ్ళలో కూడా ప్రోటీన్ పుష్కలంగా లభించే ఆహారపదార్ధాలు ఎన్నో ఉన్నాయి వీటిని క్రమం తప్పకుండ తీసుకుంటే శరీరానికి కావాల్సినంత ప్రోటీన్ లభిస్తుంది, వాటి గురించి ఇప్పుడు తెల్సుకుందాం.

చిరుతిళ్లలో వేరుశెనగల ప్రధానమైనవి. వేరుశెనగను పేద వారి జీడిపప్పుగా కూడా పరిగణిస్తారు, ఎందుకంటే దీనిలోని పోషకవిలువలు, డ్రై ఫ్రూప్ట్స్ కంటే తక్కువేమి కాదు. పైగా వీటి ధరకూడా తక్కువ కాబట్టి అందరికి అందుబాటుధరలో లభిస్తాయి. వేరుశెనగలో ప్రోటీన్ శాతం అమోగంగా ఉంటుంది. 100 గ్రాముల వేరుశెనగలో సుమారు 25 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. వీటిని ఉడకబెట్టి, వేయించి లేదంటే ఆహార పదార్ధాల్లో కలుపుకొని తినవచ్చు. ఈ మధ్యకాలంలో వైరల్ అవుతున్న ఆహారంలో రోస్టెడ్ చనా ఒకటి, సినిమాలు చూసేటప్పుడు మరియు ప్రయాణసమయంలో రోస్టెడ్ చనా మంచి చిరుతిండిగా ఉంటుంది. సెనగలు తినడం వలన బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రతి 100 గ్రాముల సెనగపప్పులో 100 గ్రాముల్లో, 19 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వీటిని వేయించి లేదంటే ఉడకబెట్టి తినవచ్చు, చాట రూపంలో కూడా వీటిని తినవచ్చు.

పెసలు లేదంటే పెసరపప్పు ప్రోటీన్లకు మంచి మూలం. వీటిని తరచు తింటూ ఉంటె లెక్కలేనన్ని ఆరోగ్యప్రయోజనాలు కలగడంతో పాటు, శరీరానికి అవసరమైన ప్రోటీన్లు కూడా లభిస్తాయి. ప్రతి 100 గ్రాముల పెసరపప్పుతో 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఈ పెసరపప్పును రోస్ట్ చేసి లేదంటే ఉడకబెట్టి తినవచ్చు, లేదంటే మొలకెత్తిన సెనగల్ని సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు. వీటితోపాటు సోయా బీన్స్ పోషకాలకు గొప్ప నిధి, సొయా బీన్స్ మరియు వీటితో తయారుచేసే సొయా చంక్స్ రెండింటిలోనూ ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. మాంసాహారం తిననివారికి ఈ సొయా బీన్స్ ప్రోటీన్కి మంచి ప్రత్యామ్న్యాయం. సొయా బీన్స్ లో అత్యధికంగా 100 గ్రాముల్లో 51 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది, కాబ్బటి సోయాబీన్స్ లేదా సొయా చంక్స్ చిరుతిళ్ళుగా అలవాటు చేసుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది.

పాలు మరియు పాల పదార్ధాలైన చీస్, పన్నీర్ ప్రోటీన్కు గొప్ప వనరుగా చెప్పుకోవచ్చు. శరీరానికి అవసరమైన పోషకాలు, ఎముకుపుష్టికి అవసరమైన కాల్షియమ్ మరియు ప్రోటీన్లు అన్ని సంవృద్ధిగా లభించే ఆహారంలో పాలు మరియు పాల పదార్ధాలు ప్రధానమైనవి. ఒక 100 గ్రాముల పన్నీర్లో 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

Related Topics

#Proteins #Health #Snacks

Share your comments

Subscribe Magazine