దాదాపు అన్ని సీసాన్లలో వ్యాధులు రావడం అనేది సర్వసాధారణం. వాతావరణంలో ఉన్నటుంది మార్పులు రావడం వలన కొన్ని ఇన్ఫెక్షన్లు మరియు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే వర్షాకాలంలో మాత్రం వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువుగా ఉంటుంది. ఎందుకంటే ఈ కాలంలో ఈగలు, దోమలు మరియు పారిశుధ్య సమస్యల మూలాన ఇన్ఫెక్షన్లు మరియు విష జ్వరాలు ఎక్కువవుతాయి. అయితే వ్యాధులు రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే కొన్ని ఆహార నియమాలను పాటించడం తప్పనిసరి. ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు అధికంగా ఉండే కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. అయితే ఈ సీజన్లో ఎటువంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాకరకాయ :
ఆరోగ్యానికి మేలు చేకూర్చే ఆహారంలో కాకరకాయ ఒకటి, అయితే దీని విపరీతమైన చేదు కారణంగా చాలా మంది తినడానికి ఇష్టపడరు. వర్షాకాలంలో కాకరకాయ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. దీనిలో నిర్విషీకరణ లక్షణాలు, రోగనిరోధక శక్తిని పెంచే సామర్థ్యం ఉంటుంది. ఇది కాలేయం, రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సీజన్‌లో కాకరకాయ తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
సొరకాయ/ఆనపకాయ:
సొరకాయ తేలికగా జీర్ణమయ్యే కూరగాయ. ఇది జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో వాటర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
గుమ్మడికాయ:
గుమ్మడికాయలో విటమిన్ ఎ, సి, ఇ, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. గుమ్మడికాయలోని విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియలో సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.
బీట్రూట్:
బీట్రూట్ లో అనేక పోషకాలు ఉంటాయి, ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బీట్రూట్లోని అధిక ఐరన్ కంటెంట్ రక్తహీనతను నివారించడంలో సహాయం చేస్తుంది. బీట్రూట్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయం చేస్తుంది. కాబట్టి వర్షాకాలంలో బీట్రూట్లు తినాలని వైద్యులు సూచిస్తారు.
Share your comments