సాధారణంగా విరేచనాలు మనం తీసుకునే ఆహారంలో ఏదైనా మార్పు జరగడం వల్ల లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి.విరేచనాలతో బాధపడేవారు తగ్గడం కోసం టాబ్లెట్లు వేసుకుంటుంటారు. టాబ్లెట్స్ వేసుకున్నప్పటికీ కొందరిలో విరేచనాలు ఆగవు. ఇలాంటి వారు సహజమైన వంటింటి చిట్కాల ద్వారా కూడా విరేచనాలకు స్వస్తి చెప్పవచ్చు.మన వంటింట్లో ఉండే కొన్ని పదార్థాల ద్వారా విరేచనాలకు ఎలా చెక్ పెట్టాలో మనం తెలుసుకుందాం...
మన వంటింట్లో ఉండే అల్లం, దాల్చిన చెక్క, మరియు తేనె విరోచనాలను కంట్రోల్ చేయటానికి ఉపయోగపడతాయి. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి మరియు రెండు టీ స్పూన్ల తేనే కలిపి తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి.
విరేచనాలు తగ్గటానికి మరొక మార్గం ఏంటంటే దాల్చిన చెక్క మరియు అల్లం అరగంట పాటు నీటిలో బాగా ఉడికించే ఆ నీటిని తాగిన ఉపయోగం ఉంటుంది.
విరేచనాలు తీవ్ర స్థాయిలో ఉంటే రోజుకు 4 లేదా 5కప్పుల గడ్డపెరుగు మరియు అరటిపండు దాల్చిన చెక్కతో కలిపి తీసుకుంటే ఉపయోగం ఉంటుంది.
విరేచనాలకు అనేక ప్రభావవంతమైన ఇంటి చిట్కాలలో కొబ్బరి నీరు ముఖ్యమైనది. విరేచనాల వల్ల కలిగి డీహైడ్రేషన్, నీరసం సమస్యలకు కొబ్బరి నీరు త్రాగటం వల్ల ఉపశమనం కలుగుతుంది.గుమ్మడి గింజలు మరియు గుమ్మడి ఆకులు విరేచనాలు తగ్గించటానికి ముఖ్య పాత్ర పోషిస్తాయి. గుమ్మడి గింజలతో మరియు ఆకులతో తయారుచేసిన రసాన్ని త్రాగటం వల్ల విరేచనాలు తగ్గుతాయి. ఈ చిట్కాలను పాటించడం ద్వారా విరోచనాల నుంచి విముక్తి పొందవచ్చు.
Share your comments