Health & Lifestyle

కుదిరితే ఇన్స్టంట్ నూడిల్స్ కి జర దూరంగా ఉండండి...

KJ Staff
KJ Staff

ఉదయాన్నే ఆఫీస్ కి వెళ్లేముందు లేదంటే అర్ధరాత్రి ఆకలి వేసినప్పుడో, కడుపు నింపుకోవడానికి ముందుగా గుర్తుకువచ్చేవి ఇన్స్టంట్ నూడిల్స్, కేవలం చిన్న పిల్లలేకాకుండా పెద్దవారికి కూడా, నూడుల్స్ ని ఇష్టపడతారు. మిగిలిన ఆహారపదార్దాలతో పోలిస్తే, నూడిల్స్ వండటానికి తక్కువ సమయం పడుతుంది కాబట్టి బాచిలర్స్ కూడా ఎక్కువగా వీటిని తినడం గమనించవచ్చు. అయితే ఈ ఇన్స్టంట్ నూడిల్స్ ప్రతిరోజు తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తేందుకు ఆస్కారం ఉంది.

అధిక సోడియం లెవెల్స్ కలిగి ఉండటం:

ఒక కప్పు ఇన్స్టంట్ నూడిల్స్లో రోజుకు కావాల్సిన దానిలో సగంకంటే ఎక్కువ శాతం సోడియం ఉంటుంది. సోడియం లెవల్స్ ఎక్కువగా ఉండే ఆహారని అధికమొత్తంలో తినడం వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వాటిలో గుండెకు సంబంధించిన వ్యాధులు, బ్లడ్ ప్రెషర్ పెరగడం, హార్ట్ స్ట్రోక్ వచ్చేందుకు ఆస్కారం ఉంది. ఇన్స్టంట్ నూడిల్స్ ప్రతిరోజు తినడం వలన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది.

తక్కువ మొత్తంలో న్యూట్రిఎంట్స్:

ఇన్స్టంట్ నూడిల్స్ తినడం వలన కడుపు నిండినట్లు అనిపించినా, శరీరానికి అవసరమైన విటమిన్లు మరియు ఇతర ఖనిజాలు లభించవు. నూడిల్స్ తయారీలో మైదా ఎక్కువ వాడతరు, కాబట్టి వీటిని తినడం ద్వారా రక్తంలోని చెక్కర శాతం అసాధారణంగా పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది. వీటిలో ఏ విధమైన ఫైబర్, విటమిన్లు, మినరల్స్ ఉండవు, వీటిని రోజు తిన్నట్లైతే శారీరానికి అవసరమైన పోషకాలు అందక రోగాలభారిన పడేందుకు అవకాశం ఉంటుంది.

చెడు కొవ్వు శాతం ఎక్కువ:

ఇన్స్టంట్ నూడుల్స్ తయారీకి వాడే పదార్ధాల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ చెడు కొలెస్ట్రాల్ అయినా ఎల్డిఎల్ స్థాయిని పెంచి మంచి కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ స్థాయిని తగ్గిస్తాయి. దీని వలన గుండె జబ్బులు, టైప్-2 డయాబెటిస్ మరియు ఎన్నో అనారోగ్య సమస్యలు రావడానికి కారణమవుతుంది.

ప్రిజర్వేటివ్స్:

ఇన్స్టంట్ నూడిల్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి మరియు వాటికి ప్రత్యేకమైన రుచి రావడానికి వీటి తయారీదారులు ఎన్నో రకాల ప్రిజర్వేటివ్స్ మరియు అడిటివ్స్ వీటికి కలుపుతారు. వీటి వలన కొంతమందిలో ఎలర్జీ రావడానికి, జీర్ణ సంబంధిత రోగాలు తలెత్తడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఇన్స్టంట్ నూడిల్స్ తినేవారు వీటి వినియోగాన్ని తగ్గిస్తే మంచిది, పిల్లలకు వీటిని స్నాక్స్ లాగా ఇచ్చే తల్లితండ్రులు, వెంటనే పిల్లలచేత వీటిని తినే అలవాటును మాన్పించాలి, లేదంటే భవిష్యత్తులో ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఇన్స్టెంట్ నూడిల్స్ తినాలనుకునేవారు వీటిని వారానికి ఒకటి లేదా రెండు సార్లు తింటే సమస్య ఉండదుకానీ ప్రతిరోజు తినేవారు మాత్రం జాగ్రత్త పాటించాలి.

Share your comments

Subscribe Magazine