కొంతమంది ఏది పడితే అది తింటూ ఉంటారు. ఏది దొరికతే అది, ఎలా పడితే అలా తింటూ ఉంటారు. కొంతమంది బాగా ఎక్కువగా తింటారు. మరికొంతమంది అసలు తినరు. మరికొంతమంది చాలా తక్కువగా తింటారు. కొంతమంది ఎక్కువ తింటే లావు అవుతామేమోనని భయపడుతూ ఎక్కువ తినరు. అసలు మనం రోజూ ఎంత తినాలి. ఎన్ని కేలరీలు తీసుకోవాలి? అనే విషయాలపై చాలామందికి అవగాహన లేదు. ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకుందాం.
మనం చేసే పనిని బట్టి తిండి తినాలి. ఫిజికల్ వర్క్ చేసేవాళ్లు దానికి తగ్గట్లు తినాలి. ఇక ఆఫీసులలో కూర్చోని వర్క్ చేసేవాళ్లు ఎక్కువగా తినకుండా శక్తినిచ్చే పదార్థాలను తీసుకుంటే సరిపోతుంది. అలాగే వయస్సును బట్టి కూడా ఈ లెక్కలు మారుతూ ఉంటాయి. అది ఎలానో తెలుసుకుందాం.
పిల్లలు, మహిళలు, వృద్ధులు రోజూ 1600 కిలో కేలరీలు తీసుకోవాలి. ఇక మగవాళ్లు అయితే రోజూ 2 వేలు కిలో కేలరీలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. ఇక రైతులు, కూలీలు, అథ్లైట్లు రోజుకి 2400 కిలోకేలరీలు తీసుకోవాలి. ప్రోటిన్స్, ఫ్యాట్స్, కార్చోహైడ్రేట్స్, ఫైబర్, మాంసం, గుడ్లు, పప్పులు, గింజలు, డ్రైప్రూట్స్ వంటి వాటిల్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇక నూనె పదార్థాలు ఎక్కువ తింటే శరీరంలో కొవ్వు పెరిగి బాగా లావు అవుతారు.
ఇక బాదం, నిమ్మరసం, బెల్లం వంటి తీసుకుంటే కొవ్వు కరిగిపోతుంది. ఇక చాక్లెట్లు, ఐస్ క్రీములు, కేకులు, బిస్కెట్లు, అలూ చిప్స్, కూల్ డ్రింక్స్ వంటి వాటిల్లో కేలరీలు ఎక్కువ ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు వీటిని దూరంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. మెట్లు ఎక్కడం, రోజుకి 3 కిలోమీటర్లు రన్నింగ్ చేయడం వాటి వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చు.
Share your comments