వయసు పైబడే కొద్దీ అనేక రోగాలు పీడిస్తుంటాయి. వీటిలో గుండె జబ్బలు, బీపీ, షుగర్, మోకాళ్ళ నొప్పలు మొదలైనవి ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. రోగాలు వచ్చాక వాటికి చికిత్స చేయించుకోవడం కంటే రాకుండా ముందస్తు చర్యలు పాటిస్తే రోగాలు రాకుండా నివారించవచ్చు. మనిషికి వచ్చే ఎన్నో రుగ్మతులని నివారించడంలో ఆహరం ప్రధాన పాత్ర పోషిస్తుంది. మనం తీసుకునే రోజువారీ ఆహారంలో కార్బోహైడ్రాట్లు, ప్రోటీన్లు, మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా లభించేలా చూసుకోవాలి.
రోజువారీ ఆహారంలో మాంసకృత్తులు తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్లు లేదా మాంశకృతులు రెండు రకాలు ఒకటి జంతువుల మాంశం నుండి లభించేవి రెండోది శాఖాహారం అయినా పప్పుదినుసుల నుండి లభించే ప్రోటీన్లు. చాల అధ్యయనాల్లో తేలిందేంటంటే మాంసాహార ప్రోటీన్ల కంటే శాకాహార ప్రోటీన్లు ఎంతో అనువైనవి. మాంశకృతుల ద్వారా అనేక ప్రయోజనాలునయ్యి. ప్రోటీన్లు కండరాలు అభివృద్ధిలో తోడ్పతాయి. మహిళల్లో వచ్చే దీర్ఘకాలిక సమస్యలను నివారించడంలో ప్రోటీన్లు సహాయపడతాయి. వయస్సు పైబడే కొద్దీ వచ్చే అనేక రోగాలను నివారించడంలో ప్రోటీన్లు తోడ్పడతాయి. ప్రోటీన్లు శక్తిని ఇవ్వడంలో, జీవక్రియను మెరుగుపరచటంలో పాలుపంచుకుంటాయి. శరిరంలో జరిగే జీవక్రియలన్నిటిలో ప్రోటీన్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మనల్ని రోగాల భారిన పడకుండా రక్షించే యాంటీబాడీలు, ఇమ్మ్యూనోగ్లోబ్లిన్స్ అన్ని ప్రోటీన్ల తోనే తయారవవుతాయి.
అయితే ఆరోగ్యానికి ఎంతో అవసరమైన ప్రోటీన్లు ఎంతవరకు అవసరమో తెలుసుకుని అంతటి పరిమాణంలో వాటిని తీసుకోవాలి. సాధారణంగా ఒక మనిషికి వారి శరీర బరువును బట్టి ప్రోటీన్ల మోతాదు నిర్దేశిస్తారు. ఒక కిలో శరీర బరువుకు సుమారు ఒక గ్రాము ప్రోటీన్ అవసరం. అయితే ఈ ప్రోటీన్ లభించడానికి ఎటువంటి ఆహారం తీసుకోవడం మంచిది అన్న సందేహం మనందరికీ వచ్చే ఉంటుంది. ప్రోటీన్లు అధికంగా లభించే ఆహారంలో గుడ్లు, పాలు, పెరుగు, మాంశం, పప్పు దినుసులు ప్రధానమైనవి. మాంశంలోని ప్రోటీన్లను శరీరం తొందరగా వాడుకుకోవడానికి వీలుగా ఉంటాయి. అయితే మాంశంలో ప్రోటీన్ల తో పాటు కొవ్వు పదార్ధాలు అధికంగా ఉంటాయి. వీటిని ఆరగించడం అంత సులభం కాదు గనుక, ఇవి శరీరంలో కొవ్వుగా పేరుకుపోయి నష్టాన్ని కలిగిస్తాయి.
శాకాహారంలో పప్పు దినుసులు మంచి ప్రోటీన్ వనరులను అందిస్తాయి. ఎఫ్ఏఓ ప్రకటించిన పరిమానం ప్రకారం రోజుకు 100 గ్రాములు పప్పుదినుసులు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. మనకు విరివిగా లభించే బొబ్బర్లు, శనగలు, ఉలవలు, పెసలు, కందులు వంటివి మంచి ప్రోటీన్ శాతం కలిగి ఉంటాయి. ఈ మధ్య కాలంలో సొయా చంక్స్ ప్రాచుర్యంలోకి వచ్చాయి. నూనె తీసేయగా మిగిలిన సొయా గింజల నుండి ఈ సొయా చంక్స్ ఎంతో మంచివి. మాంశం తినలేని వారికి సొయా చంక్స్ మాంసాహారానికి ప్రత్యామ్న్యాయంగా పనిచేస్తాయి.
Share your comments