Health & Lifestyle

"మైగ్రేన్" సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు పాటించండి

KJ Staff
KJ Staff

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ఎంతో మందిని బాధిస్తున్న సమస్య మైగ్రేన్. మైగ్రేన్ సమస్య ఉన్నవారికి తల బద్దలవుతునంత నొప్పి కలుగుతుంది. ఇంతటి తల నొప్పితో ఏ పనిమీద సరిగ్గ శ్రద్ధపెట్టలేరు. మన దేశంలో సుమారు 25% జనాభా ఈ మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నారు.

మైగ్రేన్ జన్యుపరంగా సంక్రమించే న్యూరోలాజికల్ డిసార్డర్. మైగ్రేన్ ఉన్నవారికి తలలో ఒకవైపు భరించలేని తలనొప్పి వస్తుంది. అయితే మైగ్రేన్ ఉన్నవారు జీవన విధానాల్లో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మైగ్రేన్ తలనొప్పి రాకుండా నియంత్రించుకునేందుకు అవకాశం ఉంటుంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మైగ్రేన్ ఉన్నవారు, ఎక్కువ శబ్దం చేసే సౌండ్ బాక్సులకు, ప్రకాశవంతమైన లైట్లకు దూరంగా ఉండటం మంచిది. వీటి వద్ద ఎక్కువసేపు ఉన్నట్లైతే మైగ్రేన్ తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మైగ్రేన్ ఉన్నవారు, సినిమా హాళ్లకు వెళ్లడం, రాత్రిపూట డ్రైవింగ్ చెయ్యడం, సూర్యరశ్మి ఎక్కువ ఉండే సమయాల్లో బయట తిరగడం వంటివి చెయ్యకుంటే మంచిది.

అధికంగా ఒత్తిడికి లోనవ్వడం, తరచూ మైగ్రేన్ రావడానికి మరో ప్రధాన కారణం.ఒత్తిడి, జీవితంలో వచ్చే కష్టాలను అధిగమించడానికి ఒక సాధనంగా మలచుకోగలిగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. కానీ ఒత్తిడిని మన కార్యసాధనకు ప్రతిబంధకంగా భావించడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయి. ఒత్తిడి తగ్గించుకోగలిగితే, మైగ్రేన్ చాలా వరకు కంట్రోల్ లో ఉంటుంది, దీని కోసం యోగ, మెడిటేషన్, ఎక్సర్సైజ్ చెయ్యడం వలన ఒత్తిడి దూరమవుతుంది.


ఆహార నియమాలు పాటించడం ద్వారా కూడా మైగ్రేన్ సమస్యను దూరంగా పెట్టవచ్చు. మైగ్రేన్ ఉన్నవారు ఎటువంటి ఆహరం తినాలో వైద్యుని సలహా తీసుకుని ఆ నియమాలు పాటించడం మంచిది. సాధారణంగా మైగ్రేన్ ఉన్నవారు తీపి పదార్ధాలు, నూనె ఎక్కువగా ఉండే ఆహారం, ఆల్కహాల్, కాఫీ వంటి ఆహారపదార్ధాలు మరియు పానీయాలు తగ్గించడం మంచిది. మంచి ఆహారంతో పాటు శరీరానికి సరైన నిద్ర కూడా చాల అవసరం. రోజుకు కనీసం 7-8 గంటలు నిద్ర సమయాన్ని కేటాయించండి. మైగ్రేన్ జన్యు పరమైన వ్యాధి కనుక దీనిని పూర్తిగా నయంచేసే పద్ధతి ఇంకా కనుగోలేదు, కానీ జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మైగ్రేన్ తరచూ రాకుండా నియంత్రించుకోవచ్చు.

Share your comments

Subscribe Magazine