Health & Lifestyle

పిల్లల్లో స్మార్ట్ఫోన్ అడిక్షన్ తగ్గించడం ఎలా?

KJ Staff
KJ Staff

మనకు తెలియకూండానే స్మార్ట్ఫోన్ మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఒక 10 నిమిషాలు ఫోన్ మన దగ్గర లేకుంటే ఎదో కోల్పోయిన భావన కలిగేంతలా స్మార్ట్ఫోన్ కి మనం వసమైపోయాం. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఈ సామర్ట్ఫోన్ ఆడిక్సన్ ఎక్కువైపోయింది. స్కూల్ నుండి వచ్చాక పుస్తకాలకంటే, స్మార్ట్ఫోన్ తోనే పిల్లలు కాలక్షేపం చేస్తున్నారని తల్లితండ్రులు వాపోతున్నారు. పిల్లల్లో స్మార్ట్ఫోన్ కి బానిసలు కాకుండా చెయ్యడం చాలా అవసరం, లేకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాలి.

ఏదైనా తల్లితండ్రుల నుండే పిల్లలు నేర్చుకుంటారు. పెద్దలు ఎల్లపుడు ఫోన్ లోనే కాలక్షేపం చేస్తుంటే పిల్లలు కూడా వారినే అనుకరిస్తారు. చిన్న పిల్లలది నేర్చుకునే వయసు, ఈ వయసులో గ్రహణ శక్తీ ఎక్కువుగా ఉండటం వలన పిల్లలు ఏదైనా సరే తొందరగా నేర్చుకుంటారు. అయితే స్మార్ట్ఫోన్ ను ఎక్కువగా వినియోగించే వారిలో గ్రహణశక్తి తగ్గిపోతుంది, ఏదైనా ఒక విషయంమీద దృష్టిసారించడం కష్టమవుతుంది. చిన్న వయసునుండే స్మార్ట్ఫోన్ అలవాటు చేస్తే పిల్లలు పిల్లలో జ్ఞాపకశక్తి మరియు గ్రాహనశక్తి రెండు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చిన్న పిల్లకు ఎట్టి పరిస్థితిలోను ఫోన్ ఇవ్వకూడదు.

పెద్దలు ఫోన్ తమ అవసరాలకు మాత్రమే అని చెప్పాలి. తల్లితండ్రులు సమయం కుదుర్చుకొని పిల్లలతో కాస్త సమయం గడపాలి. టీవీ మరియు స్మార్ట్ఫోన్ వినియోగానికి స్క్రీన్ టైం విధించాలి. పిల్లలకు కాళీ సమయాల్లో ఆసక్తి కలిగిన పుస్తకాలు చదవడం, వివిధ ఆటలు ఆడించడం చెయ్యాలి. దీనివలన పిల్లల్లో మానసిక వికాసం, మరియు మానసిక ఉత్తేజం కలుగుతాయి. మీరు సెల్ ఫోన్ లో గడిపే కాలాన్ని పిల్లలతో గడపడానికి ప్రయత్నించాలి.

పిల్లలకు కథలు చెప్పడం మరియు వాటి గురించి వారికి చర్చిండం ద్వారా వారిలో ఇమాజినేషన్ స్కిల్స్ పెరుగుతాయి. పిల్లతో ఆటలు ఆడించడం ద్వారా, వారికి శారీర వ్యాయామంతోపాటు, మానసిక వికాసం కూడా కలుగుతుంది. అన్నిటికీ మించి మీ పిల్లలు మీరు చెప్పింది వినడం చేస్తారు. పెద్దయ్యాక కూడా ఇది కొనసాగుతుంది . మీ అభిప్రాయాన్ని గౌరవిస్తారు.

Share your comments

Subscribe Magazine