వ్యవసాయంలో రోజురోజుకు పెరుగుతున్న రసాయన మందుల వినియోగం, పర్యావరణంతో పాటు, ఆరోగ్యానికి కూడా ఎంతో కీడు కలిగిస్తుంది. వీటికి ప్రత్యామ్న్యాయంగా ఆర్గానిక్ ఆహార పదార్ధాలు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి, ఆర్గానిక్గా పండిన ఆహారం తినేందుకు ప్రజలు కూడా ఆశక్తి చూపిస్తున్నారు. అయితే ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకునేందుకు కొంత మంది వ్యాపారస్తులు సాధారణ వ్యవసాయ ఉత్పత్తులను, ఆర్గానిక్ ఉత్పత్తులుగా విక్రయించి ప్రజలను మోసం చేస్తున్నారు. దీనిని బట్టి వినియోగదారులు ఆర్గానిక్ పండ్లు మరియు కాయగూరలు కొనుగోలు చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
ఆర్గానిక్ పద్దతిలో పండించిన ఆహారంలో పోషకాలు మరియు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారతీయ రసాయన సాంకేతిక సంస్థ చేసిన పరీక్షల్లో తేలింది. అంతేకాకుండా ఆర్గానిక్ పద్దతిలో పండిన పళ్ల యొక్క రుచి, వాసన సాధారణ పళ్లతో పోలిస్తే కాస్త వ్యత్యాసంగా ఉంటుంది. రసాయన ఎరువులతో పండించిన పళ్ళ ఎక్కువ తియ్యగా ఉంటాయి, అదే ఆర్గానిక్ ఫలాల్లో తీపి సాధారణంగా ఉంటుంది. దీనిబట్టి ఆర్గానిక్ ఉత్పత్తులు కొనుగోలు చేసే ముందు వాటి ఆకృతిని మరియు రుచిని పరీక్షించి కొనుగోలు చెయ్యాలి.
ఆర్గానిక్ పండ్లు మరియు కూరగాయలు మందులు వాడకుండా పెంచుతారు కాబట్టి వీటి సైజు కాస్త చిన్నగా ఉండటం గమనించవచ్చు, అంతేకాకుండా ఆర్గానిక్ విధానంలో పాందించిన వాటిలో గింజలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆర్గానిక్ ఉత్పత్తులు సాధారణ రసాయన మందులతో పండించిన ఉత్పత్తులతో పోలిస్తే రంగు మరియు ఆకృతిలోను ఎంతో వ్యత్యాసాన్ని కనబరుస్తాయి, ఆర్గానిక్ పళ్ళ పెద్ద అందంగా కనిపించవు అలాగే పళ్ళని విభిన్న ఆకృతుల్లో మరియు పరిమాణాల్లో కనిపిస్తాయి. పురుగు మందులు జల్లి పండించిన పళ్ళ యొక్క జీవితకాలం చాలా ఎక్కువ, వీటి నిల్వ సామర్ధ్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, అదే సేంద్రియ ఆహార పదార్ధాల జీవితకాలం చాలా తక్కువుగా ఉంటుంది, వీటిని ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన సరే వరం రోజుల కంటే ఎక్కువ నిల్వ చెయ్యలేం కాబట్టి కొనుగోలు చేసిన వెంటనే తినేలాగా చూడాలి. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఆర్గానిక్ ఉట్పతులను ఎంచుకునే ముందు సరిచేసుకొని ఎంచుకోవాలి.
Share your comments