Health & Lifestyle

ప్లేట్లెట్ కౌంట్ పెంచే అద్భుతమైన ఆహారం....

KJ Staff
KJ Staff

సాధారణంగా చాలా మంది అస్వస్థతకు గురైనప్పుడు, వారి రక్తంలో ప్లేటెలెట్ సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. పరిస్థితి మారీ విషమిస్తే ఒక్కోసారి ప్రాణాలుకోల్పోయే ప్రమాదం ఉంటుంది, ఇటువంటి సమయాల్లో దాతల నుండి సేకరించిన ప్లేటెలెట్స్ ఎక్కిస్తారు. డెంగ్యూ జ్వరం వచ్చినవారిలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడం ప్రధానమైన లక్షణం. ఈ కారణం చేత రోగి బలహీనపడిపోతాడు, దీనితోపాటు అనేక ఇతర వ్యాధులు కూడా సోకేందుకు అవకాశం ఉంటుంది. డెంగ్యూ వ్యాధి తగ్గిన రోగులు వారి రక్తంలో ప్లేటెలెట్స్ కౌంట్ పెంచుకోవడానికి ఉపయోగపడే ఆహార పదార్దాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

సిట్రస్ పళ్ళు:

ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గినవారిలో రోగనిరోధక శక్తీ కూడా క్షిణిస్తుంది. ఇటువంటి సమయంలో సిట్రస్ ఫలాలను తినడం ఉత్తమం. పుల్లని సిట్రస్ ఫలాలైన నారింజ, బత్తాయి, నిమ్మ, ఉసిరి వంటి పళ్లలో విటమిన్-సి ఎక్కువుగా ఉంటుంది. వీటిని ప్రతీరోజూ తినడం ద్వారా ప్లేట్లెట్స్ కౌంట్ తిరిగి మాములు స్థితికి చేరుకోవడమే కాకుండా రోగనిరోధక శక్తికూడా వృద్ధి చెందుతుంది.

దానిమ్మ పళ్ళు:

విటమిన్- సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న పళ్లలో దానిమ్మ పండు ప్రధానమైనది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంపొందించి, ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి. దానిమ్మ పళ్లలో ఐరన్ కూడా ఎక్కువుగా ఉంటుంది, ఐరన్ ప్లేట్లెట్స్ అభివృద్ధిలో ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. దానిమ్మ గింజలు తినలేనివారు, వీటిని జ్యూస్ గా చేసుకొని తాగినాసరే ఎంతో ప్రయోజనం ఉంటుంది.

బొప్పాయి :

చాలా మంది బొప్పాయిపళ్ళకు మాత్రమే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అనుకుంటారు, కానీ బొప్పాయి ఆకులతో కూడా ఎనలేని ప్రయోజనాలు ఉన్నాయి. డెంగ్యూ సమయంలో పడిపోయిన ప్లేట్లెట్స్ పెంచడంలో బొప్పాయి ఆకులు ప్రభావంతంగా పనిచేస్తాయి. ఈ ఆకుల్లో అసిటోజెనిన్ అనే కెమికల్ ఉండటం దీనికి ప్రధానకారణం. బొప్పాయి ఆకులను జ్యూస్ లాగా తీసుకోవడం ద్వారా ప్లేట్లెట్స్ కౌంట్ పెరగడంతోపాటు తెల్ల రక్తకణాల సంఖ్యా కూడా పెరుగుతుంది.

పాలకూర:

ఎన్నో అనారోగ్య సమస్యలకు పాలకూర ఒక దివౌషధంగా చెప్పుకోవచ్చు. పాలకూరలో విటమిన్-కే సంవృద్ధిగా ఉంటుంది, ఇది ప్లేట్లెట్ కౌంట్ తొందరగా పెంచడంలో సహాయపడుతుంది. పాలకూరలో ఉండే ఫోలేట్ ఎర్ర రక్త కణాల అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పాలకూరను, కర్రీ, సూప్ మరియు జ్యూస్ లాగా తీసుకోవచ్చు.

బీట్రూట్ :

డెంగ్యూ వ్యాధి భారిన పడిన వారు, చికిత్స అనంతరం, క్రమంతప్పకుండా తమ ఆహారంలో బీట్రూట్ ఉండే విధంగా చూసుకోవాలి. బీట్రూట్ లోని ఐరన్ రక్త శాతం పెరిగేలా చేస్తుంది. దీనిని ప్రతిరోజూ జ్యూస్ లేదా సలాడ్ లాగా తీసుకున్నట్లైతే హీమోగ్లోబిన్ మరియు ప్లేట్లెట్స్ తొందరగా పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది.

Share your comments

Subscribe Magazine