Health & Lifestyle

వేసవిలో ఏసీ మెయింటనెన్స్ ఎలా చేసుకోవాలి....

KJ Staff
KJ Staff

ఒక పక్క ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు 40-45 డిగ్రీలు మార్కును అందుకోవడంతో ప్రజలు విలవిలలాడుతున్నారు. ఎండ వేడి తప్పించుకునేందుకు ఏసీ ఒక నిత్యావరస వస్తువుగా మారిపోయింది. ఏసీ కొనుక్కోవడం ఒకెత్తితే దానిని మెయింటన్ చెయ్యడం మరొక్క ఎత్తు. క్రమంతప్పకుండా ప్రతిఏడాది ఏసీ మెయింటనెన్స్ చేపించుకోవడం మంచిది, లేదంటే కూలింగ్ సామర్ధ్యం తగ్గిపోతుంది.

వేసవి కాలంలో ఏసీ ఉన్నాసరే, సర్రిగ్గా కూలింగ్ కాకపోతే చాల చికాకుగా ఉంటుంది. ఏసీ లో కూలింగ్ సామర్ధ్యం తగ్గిపోవడానికి దానిలో పేరుకుపోయిన దుమ్ము మరియు ఇతర మలినాలు ప్రధాన కారణం కావచ్చు. ఏసీ కండెన్సర్ కి దుమ్ము మరియు మలినాలు అడ్డుగా ఉంటూ, ఏసీ కూలింగ్ సామర్ధ్యం క్రమేపి తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా ఏసీ సర్వీసింగ్ చేయించాలి, ఈ సర్వీసింగ్ లో ఇన్డోర్ యూనిట్ మరియు ఔట్డోర్ యూనిట్ క్లీన్ చేయించాలి. ఇలాచేయడం ద్వారా కూలింగ్ సామర్ఢ్యము పెరగడమే కాకుండా ఏసీ జీవిత కాలం కూడా పెరుగుతుంది.

ఏసీ కూలింగ్ సామర్ధ్యం తగ్గిపోవడానికి, ఏసీ లోని గ్యాస్ లీక్ కావడం అనేది మరొక్క ప్రధాన కారణం. ఏసీ లో మార్చిన పైపుల నుండి కానీ, కంప్రెసర్ నుండి వచ్చే వైబ్రేషన్స్ వలన కానీ ఈ గ్యాస్ లీకేజీ ఉంటుంది. గ్యాస్ లీకేజీ సమస్య తగ్గించడానికి, ఏసీ కొనుగోలు చేసేసమయంలో అలుమునియం కండెన్సర్ బదులు, కాపర్ కండెన్సర్ ఎంచుకోవడం మంచిది. కాపర్ లో తుప్పు పట్టే తత్వం, అల్యూమినియం తో పోలిస్తే తక్కువ కనుక పైపుల నుండి గ్యాస్ లీక్ కావడాన్ని నియంత్రించవచ్చు. టైం ప్రకారం మాయింటినెన్స్ చేయించడం వలన గ్యాస్ లీక్ సమస్యలు ఉంటె ముందుగానే గుర్తించి, లీకేజీని అరికట్టవచ్చు.

Share your comments

Subscribe Magazine