స్మార్ట్ ఫోన్ లేదా సెల్ ఫోన్ మన జీవితంలో ఒక నిత్యావసర వస్తువైపోయింది. చేతిలో స్మార్ట్ ఫోన్ లేకుండా ఒక అడుగు కూడా ముందుకు వెయ్యలేనంతగా మనల్ని ప్రభావితం చేసింది. ఆహరం, నీటితో పాటు స్మార్ట్ ఫోన్ రోజువారీ అవసరంగా మారింది. అయితే మనకి ఇంత ముఖ్యమైన ఫోన్ నీటిలో పడిపోతే ఒక్కక్షణం గుండెఆగినట్టు అవుతుంది. నీటిలో తడిసిన స్మార్ట్ ఫోన్ని ఈ టిప్స్ ద్వారా సేవ్ చేసుకోండి.
మనం రోజు వాడే స్మార్ట్ ఫోన్ నీటిలో పడిపోవడం వలనో, లేదా వర్షంలో తడవడం ద్వారానో, పాడైపోతు ఉంటుంది. ఇటువంటి సమయంలో భయపడకుండా, కొన్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి మన ఫోన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది.
ఫోన్ తడిసిపోగానే అందరికి వచ్చే మొదటి ఆలోచన, ఫోన్ ని బియ్యంలో ఉంచడం. కీప్యాడ్ ఫోన్లకు, కొన్ని టచ్ ఫోన్లకు ఈ ఆలోచన ఉపయోగపడినా, ఇప్పుడు వస్తున్న నాన్-డిటచబుల్ ఫోన్లకు ఈ ఆలోచన సరైనది కాదు. బియ్యంలో ఆరబెట్టేందుకు, ఫోన్ సిమ్ కార్డు మరియు బ్యాటరీ ని బయటకి తీసి బియ్యంలో ఒక 24గంటల వరకు ఉంచడం ద్వారా మీ ఫోన్ని ఆరబెట్టుకోవచ్చు.
ఆపిల్ మరియు ఆండ్రాయిడ్ ఫోన్స్ ఆరబెట్టేందుకు, ముందుగా ఒక మంచి పొడిగుడ్డతో ఫోన్ మొత్తాన్ని, శుభ్రంగా తుడవాలి. తరువాత ఒక కాటన్ బడ్ సహాయంతో ఫోన్ ఓపెన్ పార్ట్శ్ నుండి నీటిని తొలగించాలి. సాధారణంగా ఆపిల్ మరియు సాంసంగ్ ఫోన్స్ వాటర్ ప్రూఫ్ గా రావడం వల్ల నీటిలో పడినా కంగారు పడవలసిన అవసరం లేదు. అయితే అన్ని ఫోన్స్ కి వాటర్ ప్రూఫ్ ఫీచర్ ఉండదు, కాబట్టి ఇక్కడ చెప్పిన చిట్కాల పాటించిన తర్వాత , మొబైల్ సర్వీస్ సెంటర్కి తీసుకువెళ్లడం ఎంతో ఉత్తమం. ఎందుకంటే నీరు మదర్-బోర్డ్ లో ఉండిపోతే ఫోన్, షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది.
నీటిలో పడిన ఫోన్ ని హెయిర్ డ్రైయర్తో ఆరబెట్టడం, లేదా ఫ్రిజెలో పెట్టడం వంటి పనులు ఎట్టిపరిస్థితిలోను చెయ్యకూడదు. ఇలా చేయడం ద్వారా ఫోన్ శాశ్వతంగా పనిచెయ్యకుండాపోయే అవకాశం ఉంటుంది.
Share your comments