ఈ ఏడాది వేసవి కాలంలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు, ప్రతిరోజు ఉష్ణోగ్రత 40 డిగ్రీలకంటే ఎక్కువేకానీ తక్కువ ఉండటం లేదు. ఇంకా రాత్రి వేళల్లో కూడా ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటువంటి సమయంలో ఏసీ ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది, మరోవైపు ఏసీ తయారీదారులు కూడా వినియోగదారులను ఆకర్శించేందుకు వివిధ ఫీచర్లతో మరియు సరసమైన ధరల్లో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఏసీ ని కొనడంతో పాటు దానిని మైంటైన్ చెయ్యడం కూడా తెలిసుండాలి లేకుంటే నెలాఖరున వచ్చే బిల్ కళ్ళల్లో నీళ్లు తెపిస్తుంది.
ప్రస్తుతం వస్తున్న ఏసీలు అన్నిటికి ఇన్బిల్ట్ గా 24 డిగ్రీలు సెట్ చేసి వస్తుంది. ఏసీని ఆన్ చేసిన ప్రతిసారి ఇదే ఉష్ణోగ్రత ఉండటం గమనించవచ్చు. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఏసీ కంపెనీలు ఈ ఫీచర్ తో ఏసీ ని తయారుచేస్తున్నాయి. కరెంటు బిల్ తక్కువ రావాలన్న ఇదే ఉష్ణోగ్రతలో ఏసీ ని వాడటం మంచిది. 24-27 డిగ్రీల మధ్య ఏసీని వినియోగించినట్లైతే కరెంటు బిల్ తక్కువ వస్తుందని ఎనర్జీ బోర్డ్ కూడా తెలిపింది.
అయితే మీలో చాల మందికి ఒక అనుమానం ఉంటుంది ఏసీ ఉష్ణోగ్రతను 16 డిగ్రీల కంటే తక్కువ లేదా 30 డిగ్రీలకంటే ఎక్కువ సెట్ చెయ్యడం కుదరదు. ఇలా ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. ఏసీ నుండి చల్లని గాలిరావడానికి దానిలో ఉండే కండెన్సర్ ప్రధాన కారణం, కండెన్సర్ వేడి గాలిని చల్లని గాలిలా చేస్తుంది. ఏసీ ని 16 డిగ్రీలకంటే తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచిన్నపుడు ఈ కండెన్సర్ అధికంగా పనిచేయవలసి ఉంటుంది, అంతేకాకుండా తక్కువ ఉష్ణోగ్రతలో ఈ కండెన్సర్ గడ్డకట్టే ప్రమాదం ఉంటుంది, తద్వారా త్వరగా డామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ. తక్కువ ఉష్ణోగ్రతలో కరెంటు బిల్ ఎక్కువగా రావడానికి ఆస్కారం కూడా ఎక్కువే.
ఏసీ మాక్సిమం 30 డిగ్రీల వరకు సెట్ చెయ్యగలం, ఇంతకన్నా ఎక్కువైతే ఏసీ ని ఉపయోగించిన కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు. 30 డిగ్రీలకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో ఏసీ నుండి కేవలం వేడి గాలిమాత్రమే వస్తుంది, దీని వలన ఉక్కపోత మరింత ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఏసీ ని ఉపయోగించేవారు ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకోని వ్యవహరించవలసి ఉంటుంది.
Share your comments