అప్పుడే పుట్టిన చంటి పిల్లలకు పాలే ఆహారం అనుకుంటారు అందరు, అయితే అది నిజం కాదు. పిల్లలకు పాలతో పాటు ఇతర పోషకాలను కూడా అందిచాలి. ఇవి వారి ఎదుగుదలలో ఎంతో దోహదపడతాయి. తల్లితండ్రులు శిశువులకు ఇచ్చే ఆహారం పట్ల సరైన ద్రుష్టి సారించకుంటే పిల్లలు రోగాల భారిన పడే అవకాశం ఉంటుంది. పిల్లలకు అందించవలసిన ఆహారం పట్ల సరైన అవగాహన లేకపోవడం దీనికి ప్రధాన కారణం. దీనికి సంబంధించి తాజాగా ఐసిఎంఆర్ శిశువులకు ఆహారానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.
సాధారణంగా చిన్న పిల్లకు ఆరు నెలల వయసు వచ్చేంతవరకు పాలనే ఆహారంగా ఇస్తారు, అయితే చాలా మంది ఆరు నెలలు దాటినా తర్వాత కూడా పాలనే ఆహారంగా ఇవ్వడం మంచిది కాదని ఐసిఎంఆర్ సూచించింది. ఆరు నెలల వయసు దాటిన తరువాత పాలతో పాటు ఘన ఆహారం కూడా ఇవ్వాలని తల్లితండ్రులకు సూచిస్తుంది, ఇలా ఇవ్వడం ద్వారా బిడ్డ ఎదుగుదల బాగుంటుందని తెలిపింది. చాల మంది పిల్లలకు పప్పుధాన్యాలతో నీరు కలిపి ఇస్తుంటారు, ఇది మంచిది కాదని ఐసిఎంఆర్ హెచ్చరిస్తుంది. దీనికి బాధలు ఘన ఆహారని ముద్దగా చేసి దానిలో పాలు కలిపి తినిపించడం, పప్పుధాన్యాలతో పాటు, కూరగాయలు కూడా వారి ఆహారంలో చేర్చడం అవసరమని ఐసిఎంఆర్ ప్రస్తావించింది.
దీనితోపాటుగా శిశువుకు ఒక సంవత్సరం వచ్చేంతవరకు ఆహారంలో ఉప్పు మరియు పంచదార చేర్చవద్దని, మసాలాలు కలిపిన ఆహారాన్ని ఇవ్వవద్దని తెలిపింది. వీటికి బదులు ఆహారంలో నెయ్యిని చేర్చవచ్చని తెలియచేస్తుంది. శిశువుకు 10-11 నెలల వయసు దాటాకే బయట పాలు ఇవ్వాలని పేర్కొంది. చెక్కెర కలిపిన ఆహారాన్ని వీలైనంత వరకు దూరంగా ఉంచాలని, తెలియచేసింది. అయితే పిల్లలకు పళ్ళు నిశ్చింతగా తినిపించొచ్చని, వాటినిలోని సహజ చెక్కెరను వారికి సరిపోతుందని పేర్కొంది. పిల్లల ఎదుగుదలకు అవసరమైన ఆహారం, సొరకాయ, క్యారెట్, గుడ్లు, మరియు చేపలు వంటివి తినిపించడం మేలని ఐసిఎంఆర్ తెలిపింది.
Share your comments