రోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు మనం
ఆరోగ్యంగా ఉండాలంటే నిత్య జీవక్రియకు అవసరమైన అన్ని పోషక విలువలు సమృద్ధిగా కలిగిన ఆహారాన్ని తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లేకపోతే మన శరీరంలో ఇమ్యునిటీ పవర్ తగ్గి రక్తహీనత, గుండె సంబందిత వ్యాధులు, డయాబెటిస్ వంటి ప్రమాదకర వ్యాధులకు కారణం కావచ్చు. దీన్ని అధిగమించడానికి ప్రతిరోజు మన ఆహారంలో క్రమం తప్పకుండా అధిక న్యూట్రీషియన్స్ కలిగిన ఆహారాన్ని చేసుకోవాల్సి ఉంటుంది.
అధిక న్యూట్రీషియన్స్ కలిగిన సూపర్ ఫుడ్స్ లో ఆరోగ్యవంతమైన కొవ్వు పదార్థాలు గుండెను పదిలంగా ఉంచుతాయి. అధిక మోతాదులో ఉన్న ఫైబర్ జీర్ణ సంబంధిత వ్యాధులను, డయాబెటిస్ వ్యాధులను నివారించడంలో చక్కగా తోడ్పడుతుంది. ప్రతి రోజూ మన ఆహారంలో జీడిపప్పు, బాదంపప్ప,వాల్నట్స్, కర్జూరం, పిస్తా,వేరుశెనగ వంటివి తీసుకోవడం వల్ల పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, యాంటిఆక్సిడెంట్స్, విటమిన్స్, పుష్కలంగా లభిస్తాయి.కేలరీలు తక్కువగా ఉండే వీటిని అల్పాహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ప్రతిరోజు ఆకుకూరలు తీసుకుంటే వీటిలో ఫైబర్, జింక్, కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి.రక్తహీనత, డయాబెటిస్, జీర్ణ సంబంధిత క్యాన్సర్ల నుంచి రక్షణ పొందవచ్చు.అలాగే ప్రతి రోజూ గ్రీన్ టీ తాగడం వలన ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ , పాలీఫెనాలిక్ కాంపౌండ్స్ కాన్సర్, గుండె జబ్బు, డయాబెటీస్ వంటి వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది.ఇలా ప్రతిరోజు అధిక న్యూట్రీషియన్స్ కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన అన్ని పోషక విలువలు సమృద్ధిగా లభించి నిత్యం ఆరోగ్యవంతంగా ఉంటాం.
Share your comments