సాధారణంగా మనలో చాలామంది దైవం పేరిట వారంలో వారికి ఇష్టమైన రోజున ఉపవాసం ఉండడం చేస్తుంటారు. ఈ విధంగా ఉపవాసం చేయటం వల్ల వారిలో ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. అయితే ఈ విధంగా ఉపవాసం చేయటం మంచిదేనా? ఉపవాసం చేయటం వల్ల ఎలాంటి ప్రమాదాలు తలెత్తవా? అనే విషయానికి వస్తే ఉపవాసం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా ఆయుర్వేదంలో ఉపవాసాన్ని లంకనం పేరుతో ప్రత్యేకంగా చెప్పబడింది. మరి ఉపవాసం చేయటం వల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..
మనం ప్రతి రోజు వివిధ రకాల ఆహార పదార్థాలను,అధిక నూనెలు కలిగినటువంటి కొవ్వు పదార్థాలను తీసుకుంటూ ఉంటాము. అయితే ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల అవి జీర్ణం అవ్వడానికి కాస్త సమయం పడుతుంది.ఈ క్రమంలోనే మన శరీరంలో విష పదార్థాలు పేరుకుపోతాయి. ఈ క్రమంలోనే ఒక రోజు ఉపవాసం ఉండటం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు విసర్జింపబడుతుంది అదేవిధంగా కొవ్వు పేరుకుపోవడం వల్ల శరీర బరువు పెరగడానికి కారణం అవుతుంది. ఈ క్రమంలోనే ఉపవాసం ఉండటం వల్ల బరువు సమతుల్యతను కాపాడుకోవచ్చు.
ఉపవాసం ఉండటం వల్ల మనలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఈ క్రమంలోనే వారానికి ఒక రోజు ఉపవాసం చేయడం వల్ల మన శరీరంలో కొవ్వు శాతం తగ్గి గుండెకు రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడి గుండె సంబంధిత వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది. అలాగే జీర్ణవ్యవస్థకు కూడా కొంతవరకు విశ్రాంతిని కల్పిస్తుంది. అయితే ఉపవాసం చేయడం అంటే పూర్తిగా ఎటువంటి ఆహార పదార్థాలను లేదా పానీయాలను తీసుకోకుండా ఉంటారు.కానీ ఇలా చేయటం వల్ల మన శరీరంలో శక్తి పూర్తిగా కోల్పోతాము కనుక తరచూ పండ్లు పాలు వంటి వాటిని తీసుకుంటూ ఉండాలి.
Share your comments